Case Filed against Chennai Super Kings over Balck Tickets: ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్ దిశగా సూసుకుపోతోంది. లీగ్ దశలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. 7 విజయాలు, ఓ డ్రాతో 15 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. మిగతా జట్లతో ఎలాంటి సంబంధం లేకుండా చెన్నై ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. శనివారం (మే 20) చెన్నై కీలక మ్యాచ్ ఆడనుంది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు చెన్నైని ఓ వివాదం చుట్టుముట్టుంది. ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో చెన్నై మెనెజ్‌మెంట్ అక్రమాలకు పాల్పడినట్లు కేసు నమోదైంది.
చెన్నైకి చెందిన ఓ న్యాయవాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కేసు దాఖలు చేశారు. చెన్నైతో పాటు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐపై కూడా చెన్నై సివిల్ కోర్టులో ఫిటిషిన్ వేశారు. టిక్కెట్ విక్రయాల్లో అవకతవకలు జరిగాయంటూ చెన్నైకి చెందిన న్యాయవాది అశోక్ చక్రవర్తి బుధవారం కేసు వేశారు. 'ఏంఎ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల అమ్మకాలలో అక్రమాలు జరుగుతున్నాయి. బ్లాక్ మార్కెట్, ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరగుతున్నాయి. అందుకే ఈ రోజు సివిల్ కోర్టులో కేసు వేశా. చెన్నై, బీసీసీఐ, టీఎన్‌సీఏలపై ఫిటిషిన్ దాఖలు చేశాను' అని అశోక్ చక్రవర్తి తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.
ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ తమ సొంత మైదానం చెపాక్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఈ 7 మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బ్లాక్‌లో విక్రయించందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రూ. 1500, రూ. 2000ల లోయర్ స్టాండ్ టిక్కెట్లను 8,000 రూపాయలకు విక్రయించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. చెన్నైమెనెజ్‌మెంట్ పాత్ర కూడా అందులో ఉందని అరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ అశోక్ చక్రవర్తి కేసు నమోదు చేశారు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇదే ఆఖరి సీజన్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాంతో సొంత మైదానములో అభిమాన క్రికెటర్ ఆట చూసేందుకు ఫాన్స్ క్యూ కడుతున్నారు. చాలా మంది అభిమానులకు టికెట్స్ దొరక్కపోవడంతో నిరాశ పడుతున్నారు. దీన్ని అదనుగా చూసుకుని బ్లాక్ టికెట్ దందా నడుపుతున్నారట.
Also Read: Karnataka CM Siddaramaiah: అధికారిక ప్రకటన.. కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య! ఒకే ఒక్క డెప్యూటీ సీఎం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.