Prithi Narayanan Interesting comments on her husband Cricketer R Ashwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో ఇప్పటికే ఎందరో బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. ఇక క్యారమ్ బాల్ వేసి స్టార్ ఆటగాళ్లను కూడా ఔట్ చేస్తుంటాడు. అశ్విన్ ఒక దశాబ్దం పాటు భారత జట్టుకు అద్భుత విజయాలు అందించాడు. అలాంటి అశ్విన్.. చిన్నప్పటి నుంచే ఓ అమ్మాయికి బోల్డ్ అయ్యాడు. ఆమె మరెవరో కాదు.. యాష్ సతీమణి ప్రీతి నారాయణన్. స్కూల్ రోజుల్లోనే అశ్విన్ తన వెంట పడేవాడని, ఈ విషయం స్కూల్ అంతా తెలుసని ప్రీతి స్వయంగా తెలిపారు.
జియో సినిమా మ్యాచ్ సెంటర్ లైవ్ 'హ్యాంగ్అవుట్'లో మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, వేద కృష్ణమూర్తి, డానిష్ సైత్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ షోలో పాల్గొన్న రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రీతి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అశ్విన్, తన పరిచయం, పెళ్లి ఎలా జరిగిందో తెలిపారు. 'నేనూ, అశ్విన్ ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. 7వ క్లాస్ నుంచి మాకు పరిచయం ఉంది. ప్రతి రోజూ స్కూల్‌కి కలిసి వెళ్లే వాళ్లం. అప్పటినుంచే నేను అంటే తనకు ఇష్టం ఉంది. ఈ విషయం స్కూల్ అంతా తెలుసు. అయితే క్రికెట్ కోసమని అశ్విన్ స్కూల్ మారాడు. దాంతో తక్కువగా కలిసే వాళ్లం' అని ప్రీతి చెప్పారు.
'చదువు అనంతరం నేను ఓ ఈవెంట్ కంపెనీలో అకౌంట్స్ చూసేదాన్ని. ఒక సారి చెన్నై సూపర్ కింగ్స్ అకౌంట్స్ వ్యవహారాలు చూస్తున్న సమయంలో క్రికెట్ మైదానంలో ఆర్ అశ్విన్‌ను చూసి షాక్ అయ్యా. అతడిలో చాలా మార్పులు చూశాను. అశ్విన్ ముక్కుసూటిగా మాట్లాడుతాడు. 'చిన్నప్పటి నుంచి నేను నిన్ను ఇష్టపడుతున్నా. రోజులు మారినా నీపై ఉన్న ప్రేమ అలానే ఉంది. మనం ఇప్పుడు పెద్దవాళ్లం అయ్యాం. పెళ్లి చేసుకుందాం అని అడిగాడు'. అశ్విన్ ఓ మంచి భర్త, తండ్రిగా వ్యవహరిస్తున్నాడు' అని ప్రీతి చెప్పుకొచ్చారు.
గొడవ ఎవరు ప్రారంభిస్తారు అని అడిగిన ప్రశ్నకు ఆర్ అశ్విన్ అని ప్రీతి చెప్పింది. ఇద్దరిలో ఎవరు రెడీ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు? అని అడగ్గా.. తానే అని తెలిపారు. అశ్విన్ త్వరగా రెడీ అవుతాడు కానీ.. ప్రారంభించడానికి టైం తీసుకుంటాడన్నారు. తామిద్దరం చాలా సమయపాలన పాటించేవాళ్లమని ప్రీతి పేర్కొన్నారు. యాష్ భారత్ తరఫున 92 టెస్టులు, 113 వన్డేలు, 65 టీ 20లు ఆడాడు. ఇక ఐపీఎల్ టోర్నీలో 193 మ్యాచులు ఆడాడు. కెరీర్ ఆరంభంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అశ్విన్.. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మారాడు. ఢిల్లీ తరఫున మూడేళ్లు పాటు ఆడిన యాష్.. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌లో కొనసాగుతున్నాడు.
Also Read: Google Pixel Fold: గూగుల్ నుంచి తొలి ఫోల్డబుల్ ఫోన్.. డిజైన్, స్పెసిఫికేషన్ వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.