Venkatesh Prasad Name Trends after Gill Replaces KL Rahul in IND vs AUS 3rd Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఇండోర్ వేదికగా నేడు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ మొదలైంది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు మూడో టెస్ట్ కోసం భారత తుది జట్టులో చోటు దక్కలేదు. రాహుల్ స్థానంలో ఓపెనర్‌గా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అవకాశం ఇచ్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు గిల్ మంచి ఆరంభం ఇవ్వలేకపోయాడు. 21 పరుగులు చేసి మాథ్యూ కుహ్నెమన్‌కు దొరికిపోయాడు.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో (మూడు ఇన్నింగ్స్‌ల్లో) కేఎల్ రాహుల్ చేసింది కేవలం 38 (20, 17, 1) పరుగులే. దీంతో రాహుల్‌ను తుది జట్టు నుంచి తప్పించాలని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని ఫాన్స్, మాజీలు కామెంట్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్.. భారత జట్టు యాజమాన్యంపై విమర్శలు గుప్పించాడు. యువ ఆటగాళ్లు జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నారని, రన్స్ చేయని రాహుల్‌కు పదే పదే అవకాశాలు ఎందుకు ఇస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ గణాంకాలను కూడా ప్రస్తావించాడు.
విమర్శల నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మూడో టెస్ట్ కోసం కేఎల్ రాహుల్‌ను తప్పించి శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇచ్చాడు. మూడో టెస్ట్ ప్లేయింగ్ 11 బయటికి రాగానే.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. 'కేఎల్ రాహుల్‌ను జట్టు నుంచి తప్పించారు.. ఈ భూమ్మీద ఎక్కువగా సంతోషించే వ్యక్తి వెంకటేశ్ ప్రసాదే' అని ఒకరు కామెంట్ చేయగా.. ప్లేయింగ్ 11 చూసి వెంకటేశ్ ప్రసాద్ ఇలానే డ్యాన్స్ చేసి ఉంటాడు' అని ఇంకొకరు కామెంట్ చేశాడు. మొత్తానికి వెంకటేశ్ ప్రసాద్‌ను ఫాన్స్ ఓ ఆటాడుకుంటున్నారు. ఫన్నీ వీడియోస్ పోస్ట్ నెటిజన్లను నవ్విస్తున్నారు.
Kl Rahul Dropped 🌚 Happiest Person On Earth RN :- #INDvAUS pic.twitter.com/wbKdoPtJtP
— Aryan (@CrazyHitmanFan) March 1, 2023
తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆస్ట్రేలియా మూడో టెస్టులో భారత జట్టుకు గట్టి పోటీనిస్తోంది. మొదటి రోజు (మార్చి 1) ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 156 రన్స్ చేసింది. దాంతో మొదటి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ నిలిచింది. పీటర్ హాండ్స్‌కాంబ్ (7), కామెరూన్ గ్రీన్ ( 6) క్రీజులో ఉన్నారు. ఉస్మాన్ ఖవాజా (60) హాఫ్ సెంచరీతో మెరిశాడు. భారత బౌలర్ రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ల ధాటికి భారత్ 109 పరుగులకు ఆలౌటైంది.
Scenes after KL Rahul dropped from team#INDvAUS pic.twitter.com/4cCvvtodg0
— Anoop 🇮🇳 (@ianooop) March 1, 2023
Most happy and awa most sad person after seeing KL Rahul dropped from 3rd test, Venkatesh Prasad pic.twitter.com/q1Y059zYAe
— supremo ` (@hyperKohli) March 1, 2023
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.