Sunil Gavaskar slams Rishabh Pant over his shot selection in IND vs SA 2nd Test : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా లక్ష్యంగా దిశగా సాగుతోంది. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మ్యాచుపై పూర్తిగా పట్టు సాదించింది. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 122 పరుగులు కావాలి. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానే (58), ఛెతేశ్వర్ పుజారా (53) అర్ధ శతకాలు సాధించగా.. హనుమ విహారి (40) నాటౌట్‌గా నిలిచాడు. అయితే కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) డకౌట్ అయ్యాడు. పంత్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) మండిపడ్డారు.
ఓవర్‌నైట్ స్కోరు 85/2తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాటర్లు చేతేశ్వర్ పుజారా (Pujara), అజింక్య రహానే (Rahane) ఆచితూచి ఆడుతూ పరుగులు చేశారు. ఇద్దరు చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలిస్తూ.. స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలో పుజారా, రహానే అర్ధ శతకాలు చేశారు. వీరద్దరూ కలిసి 111 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే కాగిసో రబాడ (Rabada) స్వల్ప వ్యవధిలో ఇద్దరినీ ఔట్ చేసి షాక్ ఇచ్చాడు.
Also Read: PM Narendra Modi: ప్రాణాలతో చేరుకోగలిగాను.. మీ సీఎంకు థాంక్స్: ప్రధాని మోదీ
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ డకౌట్ (Pant Duck) అయ్యాడు. కాగిసో రబాడ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన పంత్.. వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. భారత్ స్కోర్ 165 పరుగుల వద్ద పంత్ ఐదవ వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఓ వైపు హనుమ విహారి పోరాడినా.. మరోవైపు అతడికి సహకారం అందించే వారు కరువయ్యారు. దాంతో భారత్ (India All-Out) 266 పరుగులకు ఆలౌటైంది. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. నిర్లక్ష్యపు షాట్ ఆడాడని, కాస్తైనా భాద్యత ఉండక్కర్లేదా అని కామెంటరీ చెపుతున్న సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు.
రెండో టెస్టు కోసం కామెంటరీ ప్యానెన్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'అప్పటికే స్వల్ప వ్యవధిలో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఇద్దరు కొత్త బ్యాటర్లు క్రీజులో ఉన్నారు. అలాంటి సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన రిషబ్ పంత్ చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాడు. ఇది అసలు క్షమార్హం కాదు. కొంచెమైనా బాధ్యతాయుతంగా ఆడాల్సింది. రహానే, పుజారా వంటి సీనియర్లు బాగా ఆడారు. దెబ్బలు తగిలినా కూడా పోరాడారు. పంత్ కూడా అలానే ఆడి ఉంటే బాగుండేది. పంత్ చెత్త ప్రదర్శనపై చెప్పేందుకు నాకు మాటలు రావడం లేదు' అని అన్నారు.
Also Read: Kartik Aaryan Lady Fans: యువ హీరో ఇంటిముందు లేడీ ఫాన్స్ రచ్చ.. ఏక్ మినట్, ఏక్ మినట్ అంటూ!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.