Shardul Thakur on Virat Kohli Test captaincy: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీని వదిలేస్తాడని ఎవరూ ఊహించలేదని భారత స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ అన్నాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా గొప్ప విజయాలు సాధించిందన్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న తర్వాత భారత జట్టు ఆటగాళ్లు ఎమోషనల్ అయ్యారని శార్దూల్ తెలిపాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోయిన తర్వాత భారత టెస్ట్ కెప్టెన్‌గా తాను వైదొలుగుతున్నట్టు విరాట్ ప్రకటించాడు.
ఓ జాతీయ మీడియాతో శార్దూల్ ఠాకూర్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ వదులుకోవడం చాలా బాధాకరం. విరాట్ ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కోహ్లీ సారథ్యంలో భారత్ గొప్ప విజయాలు సాధించింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో మేం బాగా ఆడాం. చాలా తక్కువ మ్యాచుల్లో మేం ఓడిపోయాం. అది కూడా స్వల్ప తేడాతోనే. కోహ్లీ ఆధ్వర్యంలో జట్టు బాగా రాణిస్తోంది. ఏదేమైనా అతడు తీసుకున్న నిర్ణయాన్ని మనమంతా గౌరవించాల్సిన అవసరం ఉంది' అని అన్నాడు.
'జట్టును నడిపించే సారథులు మారినా నా పాత్రలో ఎటువంటి మార్పు ఉండదు. ఒక్కో కెప్టెన్‌కి ఒక్కో ప్రత్యేక శైలి ఉంటుంది. కానీ అంతిమ లక్ష్యం మాత్రం జట్టును గెలిపించడమే. మనం ఎవరి నాయకత్వంలో ఆడుతున్నామన్నది ముఖ్యం కాదు. జట్టు విజయం కోసం ఎంత కృషి చేశామన్నదే ముఖ్యం' అని శార్దూల్ ఠాకూర్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ సారథ్యంలో శార్దూల్ మ్యాచులు ఆడాడు.
జోహన్నెస్‌బర్గ్ టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్ 61 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టి మంచి బ్రేక్ ఇచ్చాడు. 'చివరి రెండు టెస్టుల్లో అదృష్టం మా వైపు లేదు. బ్యాటర్ ఎడ్జ్ తీసుకున్న కొన్ని బంతులను మేం మిస్ చేశాం. ఇది జట్టు విజయంపై ప్రభావం చూపింది. 200 పరుగులను ఈజీగా ఛేజ్ చేయొచ్చు. ఆ రెండు టెస్ట్ మ్యాచ్‌లలో మా బౌలింగ్ మరియు ఫీల్డింగ్ యూనిట్ విఫలమైంది' అని ఠాకూర్ చెప్పాడు.
Also Read: అచ్చు ఐపీఎల్ మాదిరే.. భర్తను వేలం సైట్‌లో అమ్మకానికి పెట్టిన భార్య! నో రిటర్న్, నో ఎక్స్చేంజ్!!
Also Read: Ante Sundaraniki Release Date: ‘అంటే సుందరానికీ!’ సినిమా కోసం సమ్మర్ సీజన్ ను బ్లాక్ చేసిన హీరో నాని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook