Tim Southee beats MS Dhoni Batting Record in New Zealand vs England 2nd Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ టీమ్ సౌథీ చెలరేగిన విషయం తెలిసిందే. సహచరులు స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాటపట్టినా సమయంలో టీ20 మ్యాచ్‌ని తలపించేలా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లీష్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 49 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ చేసే క్రమంలో టెస్టుల్లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును అధిగమించాడు.
టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో ఎంఎస్ ధోనీని టీమ్ సౌథీ అధిగమించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ధోనీ 78 సిక్స్‌లు బాధగా.. సౌథీ 82 సిక్స్‌లు బాదాడు. మొత్తంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో సౌథీ 11వ స్థానంలో ఉన్నాడు. ధోనీని మాత్రామే కాదు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (69), టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (68), భారత మాజీ సారథి కపిల్ దేవ్ (61)ను కూడా సౌథీ దాటేశాడు.
టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో స్టోక్స్ ఇప్పటివరకు 109 సిక్స్‌లు బాదాడు. బ్రెండన్ మెక్ కల్లమ్ (107), ఆడమ్ గిల్ క్రిష్ (100), క్రిస్ గేల్ (98), జాక్వలిన్ కలిస్ (97) టాప్ 5 జాబితాలో ఉన్నారు. ఇక భారత్ తరఫున మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (91) టాప్ లో ఉన్నాడు. 78 సిక్స్‌లతో ఎంఎస్ ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లండ్ జట్టుపై తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ పడగొట్టిన టీమ్ సౌథీ.. అన్ని ఫార్మాట్లలో కలిపి 700 వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. డానియల్ వెటోరి 696 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా సౌథీ 15వ స్థానంలో ఉన్నాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (1,347) వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మురళీధరన్ రికార్డు బద్దలు కొట్టడం దాదాపుగా ఎవరి వాళ్ళ కాకపోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి