టీడీపీయే ప్రధాన టార్గెట్ గా విరుచుకుపడుతన్న పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పై మంత్రి జవహర్ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ బీజేపీకి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని ఎదరించాలని పవన్ కు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని హోల్ సేల్ గా కాంగ్రెస్ కు అమ్మితే..పవన్ జనసేన పార్టీని బీజేపీకి రిటైల్ గా అమ్ముతున్నారని ఎద్దేవ చేశారు.
సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానంలో నిలవడంపై ఏపీ సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ ఇది ఏపీ అభివృద్దికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యపడిందన్నారు. ఏపీ అగ్రస్థానంలో నిలవడం వెనుక అధికారుల కృషి ఎంతో ఉందని చంద్రబాబు మెచ్చుకున్నారు. టీడీపీ పరిపాలన మెరుగ్గా ఉందనడానికి తాజా పరిణమామమే నిదర్శనమని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో చంద్రబాబు పార్టీ యంత్రాంగాన్ని సమయాత్తం చేసే పనిలో పడ్డారు. ఎన్నికలు ఎదుర్కొవాలంటే బూత్ స్థాయి కమిటీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నందున ఆయన దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 55 శాతం బూత్ స్థాయి కమిటీలు వేయడం పూర్తయినట్లు సమాచారం. ఇక మిగిలిన పని కూడా శరంవేగంగా చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అమరావతిలోని ప్రజాదర్బార్ హాలులో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు.
ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలపై మాత్రమే పోరాడుతూ వచ్చిన టీడీపీ..ఇప్పుడు ఏకంగా గవర్నర్ వ్యవస్థపైనే గురిపెట్టింది. గవర్నర్ గిరిని రద్దు చేయలనే డిమాండ్ తెరపైకి తెచ్చింది. ఉన్నట్లుండి టీడీపీ ఎందుకు ఇలా విమర్శలు చేస్తోంది.. ఇంతకీ గవర్నర్ చేసిన తప్పేంటని అనుకుంటున్నారా .. అయితే వివరాల్లోకి వెళ్లండి.. మీకే అర్థమౌతుంది..
తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ వేగంగా స్పందించింది. ఏఎన్ ఐ కథనం ప్రకారం లోక్ సభలో టీడీపీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ తన పూర్తి మద్దతు తెలిపిింది.ఏపీ పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి ఈ మేరకు ప్రకటించారు. టీడీపీకి బద్ధవిరోధి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసానికి మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అవిశ్వాసంతో ఎన్డీయే సర్కార్ కు ఏం జరుగుతుందనే విషయం అటుంచితే.. కాంగ్రెస్ పార్టీ టీడీపీకి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే అవుతుంది.
విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు లోక్ సభను స్తంభింపచేస్తున్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే టీడీపీ ఎంపీల నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ప్లకార్లులతో నిరసన ప్రదర్శన చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళవారతావరణం నెలకొంది. దీంతో లోక్ సభ స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలోనూ ఇదే తీరు కొనసాగించింది. ఏపీకి న్యాయం చేయాలని టీడీపీ ఎంపీలు ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు చేతపట్టుకొని నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను వాయిదా వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.