'రాజ్యాంగాన్ని కాపాడండి' పేరిట ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ మోడీ నిర్వీర్యం చేస్తున్నారని.. ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ ఎంపీలను కూడా మాట్లాడించేందుకు మోడీ సిద్ధంగా లేరని విమర్శించారు. మోడీ తన మనసులో మాటను మాత్రమే వినాలనే ధోరణితో ఉన్నారని రాహుల్ విమర్శలు సంధించారు.
హిమాచల్ ప్రదేశ్ లో 1985 నుంచి ప్రతీ ఐదేళ్లకు ఓసారి జరిగే మ్యాజికే మళ్లీ రిపీట్ అయింది. ప్రతీ ఐదేళ్లకు ఓసారి జరిగే ఎన్నికల్లో ప్రభుత్వం పార్టీల చేతులు మారడం ఇక్కడ 1985 నుంచి ఓ ఆనవాయితీగా వస్తోంది. అదే ఆనవాయితీ ప్రకారమే ప్రస్తుత ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలవగా ఈసారి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 68 స్థానాలకిగాను బీజేపీ 43 స్థానాల్లో విజయం సొంతం చేసుకోగా కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలు, ఇతరులు మరో నాలుగు స్థానాలు దక్కించుకున్నారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పై 22 అత్యధిక స్థానాల్లో గెలుపొంది తన సత్తా ఏంటో చాటుకుంది బీజేపీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.