కాంగ్రెస్ పార్టీలో నిరసన స్వరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పార్టీ సీనియర్ల రూపంలో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మొన్న కపిల్ సిబల్..నేడు గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్ పార్టీకు అధికారం కష్టమే అంటున్నారంతా.
బీహార్ ఎన్నికల ఫలితాపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సొంతపార్టీపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తించడం లేదంటూ కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జబ్ తక్ సమోసామే ఆలూ రహేగా..తబ్ తక్ బీహార్ మే లాలూ రహేగా… ఇప్పటివారికి ఈ మాటలు గుర్తున్నాయో లేదో గానీ లాలూ తరచూ చెప్పిన మాటలివి. అటువంటిది బీహార్ రాజకీయాల్లో తొలిసారి లాలూతో పాటు మరో ఇద్దరు కీలకనేతల్లేకుండానే రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి.
రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై ( Rajastan political crisis ) ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువనేత సచిన్ పైలట్ స్పందించారు. సంక్షోభం సమయంలో తన ప్రత్యర్థి వర్గం తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. చాలా బాధించాయని, రాజకీయాల్లో ఒక పద్ధతి పాటిస్తే బాగుంటుందని సచిన్ పైలట్ ( Sachin Pilot ) అభిప్రాయపడ్డారు.
బీజేపీలో చేేరే విషయమై రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ మరోసారి స్పష్టత ఇచ్చారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టంగా చెప్పారు. ఆ పార్టీపై పోరాడి గెలిచినప్పుడు అదే పార్టీలో ఎలా చేరతామని పైలట్ ప్రశ్నించారు.
Rajya Sabha election రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో గుజరాత్లో ( Gujarat ) మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్ ( Akshay Patel ), జీతూ భాయ్ చౌదరి ( Jitu Bhai Chaudhary ) తమ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదికి లేఖలు పంపారు.
గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న చత్తీస్ ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తుదిశ్వాస విడిచారు. రాయపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అజిత్ జోగి మరణ వార్తను
కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. ముఖ్యంగా వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుణఎగవేతదారుల రుణాలను మాఫీ చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) సాధారణ ప్రజానీకంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. నగరాల నుండి భారీ సంఖ్యలో జనం కాలినడకనే సొంతూళ్లకు వెళ్తున్నందున వారు వెళ్లే మార్గంలో ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు ఆ వలసదారులకు అన్నపానీయాలు అందించి, సేదతీరేందుకు నీడ కల్పించాల్సిందిగా రాహుల్ గాంధీ కోరారు.
ఢిల్లీ అల్లర్లకు కారకులెవరు ? ఢిల్లీలో హింసకు పాల్పడిన అల్లరిమూకలు, ముఠాలను ప్రోత్సహించిందెవరు ? దేశం నలుమూలల నుంచి వివిధ సందర్భాల్లో నేతలు చేస్తోన్న విద్వేషపూరిత ప్రసంగాలే అల్లరిమూకలు విధ్వంసానికి పాల్పడేందుకు ఊతమిస్తున్నాయా ? ఒక పార్టీపై మరొక పార్టీ బురదజల్లుకునే క్రమంలో నేతలు ఇస్తోన్న విధ్వేషపూరిత ప్రసంగాలు అల్లరిమూకలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో తెలిపే ప్రత్యేక కథనమే ఈ వీడియో స్టోరీ.
ఢిల్లీ అల్లర్లు ఇటీవల ఎంతటి విషాదాన్ని మిగిల్చాయో.. ఎంత ప్రాణనష్టానికి కారణమయ్యాయో తెలిసిందే. అయితే ఆదివారం రాత్రి మరోసారి అటువంటి సీన్ రిపీట్ చేసేందుకు మరో కుట్ర జరిగింది. దీంతో ఢిల్లీ వాసులు ఒక్కసారిగా వణికిపోయారు. ఏదో జరుగుతోందని పసిగట్టిన పోలీసులు వెంటనే అప్రమత్తమై అందరికీ ధైర్యం చెప్పి టెన్షన్ తగ్గించారు. ఇంతకీ ఆదివారం రాత్రి ఏం జరిగిందో తెలియాలంటే ఇదిగో ఈ స్టోరీ చూడాల్సిందే.
ఢిల్లీలో అల్లర్లు, హింస వెనుక బీజేపి, ఆమ్ ఆద్మీ పార్టీ హస్తం ఉన్నాయని కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. బీజేపి, ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు కలిపిందని.. లేదంటే ఈ అల్లర్లకు ప్రధాన కారకులైన తాహీర్ హుస్సేన్, కపిల్ మిశ్రాలపై ఢిల్లీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని కర్ణాటక కాంగ్రెస్ నిలదీసింది.
రాజస్థాన్లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ యువ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది దారుణమైన ఘటనని, తీవ్ర మనస్తాపాన్ని వ్యక్తం చేషారు.
కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన ప్రారంభించిందని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఓ ప్రకటనలో తెలిపింది.
షాహీన్ బాఘ్ నిరసనకారులపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఘాటుగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాఘ్లో జరుగుతున్న ఆందోళనలు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పనేనని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. ''షాహీన్ బాఘ్ నిరసనల వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల కుట్ర ఉంది'' అని కేంద్ర మంత్రి జవదేకర్ ఆరోపించారు.
తెలంగాణలో పురపాలక ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగించాయి. ప్రచారం గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించొద్దని సభలు సమావేశాలకు అనుమతి లేదని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సెల్ఫోన్లు, ఇంటర్నెట్, ఏ ఇతర సాంకేతిక సాధనాల ద్వారా ప్రచారం నిర్వహించొద్దని సూచించింది.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామాత్యులు మంత్రి కేటీఆర్ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. కేటీఆర్ పై విచారణకు ఆదేశించకుంటే తాను కోర్టుకు వెళతానని
కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి 78 జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డు వద్ద గల ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు.
పౌరసత్వ సవరణ చట్టం 2019 బిల్లుపై ఈశాన్య ప్రజలను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతోందని, ఈ బిల్లుపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ప్రహ్లాద్ జోషి అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.