Corona Second Wave: కరోనా లక్షణాలు సైతం భారీగా మారాయి. తొలి వేవ్‌లో పొడి దగ్గు, వాసన మరియు రుచిని కోల్పోవడం, జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపించేవి. ఫస్ట్ వేవ్‌తో పోల్చితే కరోనా కేసులు మూడింతలు పెరిగాయి. కోవిడ్19 మరణాలు సైతం భారీగా నమోదయ్యాయి.
ICMR On Black Fungus: COVID-19 బాధితులలో Mucormycosis అనే అనే నల్లటి ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తించారు. తొలి దశలోనే దీన్ని గుర్తించకపోతే కంటి చూపు పోతుందని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ICMR కరోనా పేషెంట్లలో ఈ వ్యాధిని పరీక్షించాలని చెబుతున్నాయి.
సంజయ్ దత్‌కి లంగ్ క్యాన్సర్ అని.. చికిత్స తీసుకోవడం కోసం ఆయన ఇవాళే అమెరికాకు బయల్దేరి వెళ్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడంతో ఆగస్టు 8న కుటుంబసభ్యులు ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో ( Lilavati hospital ) చేర్పించిన సంగతి తెలిసిందే.
కరోనావైరస్తో ( Coronavirus ) బాధపడుతూ స్వామి నాథన్ అనే తమిళ చిత్ర నిర్మాత ఇవాళ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కరోనావైరస్ పాజిటివ్ ఉందని తెలిసిన అనంతరం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు.
కరోనా వైరస్ లక్షణాలున్న తనకు కోవిడ్ టెస్ట్ చేయండని ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన తన సోదరుడికి పారాసిటమోల్ టాబ్లెట్స్ చేతిలో పెట్టి పంపించారని ఓ యువకుడు శనివారం మీడియా ఎదుట వాపోయాడు. అంతేకాకుండా ఇదే విషయమై ఫిర్యాదు చేద్దామని హెల్ప్ లైన్ నెంబర్స్‌కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అక్కడి నుండి స్పందనే కనిపించలేదంటున్నాడు బాధిత యువకుడి సోదరుడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.