ప్రాణాంతక కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది, దాని లక్షణాలు ఇదివరకే తెలుసుకున్నాం. అయితే తాజాగా మరికొన్ని కరోనా లక్షణాలను గుర్తించారు. ఈ 6 లక్షణాలుంటే కూడా కరోనా బాధితులుగా పరిగణించే అవకాశం ఉందని, అవి కరోనా ముందస్తు లక్షణాలుగా భావించాలని చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఆరోగ్య సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఆ 6 లక్షణాల వివరాలు ప్రకటించింది. 2 నుంచి 14 రోజుల వ్యవధిలో కరోనా లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది. ఏపీలో మరో 82 మంది కరోనా బాధితులు
చలి: ఎవరికైనా అకస్మాత్తుగా చలిగా ఉన్నట్లు అనిపిస్తే దాన్ని కొట్టిపారేయవద్దు. ఇతరులకు లేనిది ఓ వ్యక్తి చలి పెడుతుందని చెప్పాడంటే అది కరోనా లక్షణంగానే భావించాలని రీసెర్చర్లు చెబుతున్నారు. ఆ లక్షణాలు కనిపించిన వారు కోవిడ్19 టెస్టులు చేయించుకుని నిర్ధారించుకోవాలి. Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!
రుచి, వాసన తెలియదు: కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు రుచి అంతగా తెలియదట. పైగా వాసనను సైతం పసిగట్టకపోవడం జరుగుతుందని సీడీసీ గుర్తించింది. ఈ లక్షణాలుంటే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.
పదే పదే వణకడం: కరోనా లక్షణాలు వెంటనే బయటపడవు కనుక మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. పదే పదే వణుకుతున్నారంటే వైరస్ అప్పుడే సోకి ఉంటుందని రీసెర్చర్లు గుర్తించారు అందులోనూ భారత్ లాంటి దేశంలో ఎండ కాలంలో చలి అంటూ ఎవరైనా వణికారంటే కరోనా లక్షణాలుగా భావించాల్సి ఉంటుంది. అమెరికాలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. సమంత బర్త్‌డే.. నాగచైతన్య సర్ప్రైజ్
గొంతులో మంట: దగ్గు, జలుబు రావడంతో పాటు గొంతులో మండినట్లుగా అనిపించడం కోవిడ్19 లక్షణమేనని సీడీసీ సూచిస్తోంది. ఇదివరకు కూడా ఇలాంటి సమస్య చాలా మందికి ఉండవచ్చు. కానీ ప్రస్తుత సమయంలో మాత్రం గొంతులో నొప్పి, మండుతున్నట్లుగా అనిపిస్తే కరోనా లక్షణాలుగా భావించాలి.
తలనొప్పి: ఏదైనా పని ఒత్తిడి వల్లనో, లేక కొన్ని రకాల ఆహారం తింటే అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది. అయితే తలనొప్పి పదే పదే రావడం, తల అధికంగా బరువుగా ఉన్నట్లు అనిపిస్తే ఏమాత్రం ఉపేక్షించవద్దు. కరోనా టెస్టులకు వెళ్లడం, లేక డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో ఏ లక్షణాలు లేకున్నా ప్రాణాంతక వైరస్ బారిన పడ్డ కేసులు సైతం నమోదవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
కండరాల నొప్పి: అమెరికాలో కరోనా బాధితుల్లో వైద్యులు గుర్తంచిన మరో ముఖ్య లక్షణం కండరాల నొప్పి. 50 లేక అంతకంటే ఎక్కవ వయసున్న వారిలో ఈ లక్షణాలు అధికంగా గుర్తించారు. అమెరికా ఒక్క దేశంలోనే దాదాపు 10 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 56వేలకు పైగా మరణించారు.
ఆ దేశానికి సంబంధించిన హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ తాజాగా వెల్లడించిన తాజా కరోనా లక్షణాలు కనుక మనం ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావడం వల్ల మనతో పాటు కుటుంబసభ్యులకు ప్రాణాపాయం కలగకుండా రక్షించుకోవచ్చు. ఉమర్ అక్మల్‌పై నిషేధం.. ఇడియట్ అంటూ మాజీ క్రికెటర్ ఫైర్