బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఫిబ్రవరి 7న తమ కుమారుడు రిత్విక్ వివాహం జరగనున్న నేపథ్యంలో ఆ వివాహ వేడుకకు రావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం రమేశ్ ఆహ్వానించారు.
ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ బుధవారం 40 మంది స్టార్ క్యాంపెనర్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ,
‘రాహుల్ గాంధీని ఎంపీగా ఎందుకు ఎన్నుకున్నారు. రాహుల్‌తో నాకు వ్యక్తిగతంగా ఏ విభేదాలు లేవు. చాలా మంచి వ్యక్తి. కానీ నవ భారతానికి ఓ వంశానికి చెందిన ఐదవ తరం నేత అవసరం లేదు. 2024 ఎన్నికల్లో రాహుల్‌ను ఎన్నుకోవద్దు’ అని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సూచించారు.
దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు క్షీణిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతూ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులతో ఆర్ధిక మందగమనంపై మాట్లాడే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి ఉందా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రధానికి ఆ ధైర్యం లేదు అని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు
గత అయిదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులతో హ్యాపీగా ఉన్నట్లయితే ఆప్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ కోరారు. సీఏఏ ఢిల్లీ ఓటర్లను ఏ విధంగానూ ప్రభావితం చేయదని, దేశ రాజధాని ప్రజలు కేవలం అభివృద్ధికి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.
జేఎన్‌యూలోకి దుండుగులు ప్రవేశించి దాడి చేసిన ఘటనలో 28 మంది విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. కొందరు విద్యార్థులు తలకు కట్లతో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొద్ది రోజుల గ్యాప్ తర్వాత .. మళ్లీ బీజేపీపై శివసేన విమర్శల దాడులు ప్రారంభించింది. దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ తప్పుదోవ పట్టిస్తున్నాయని శివసేన విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బీజేపీపై సామ్నా సంపాదకీయంలో ఘాటుగా విమర్శలు గుప్పించింది.
దేశంలో చాలా రాష్ట్రాల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రానుందని, దీన్ని ఎదుర్కొనేందుకు మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నామని అని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పీఎం, సీఎంలు, కలెక్టర్లు తప్ప మిగతా వారు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారని అన్నారు.
ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్టు వెలువడిన వార్తలు ఒకింత కలకలం సృష్టించాయి. కరెంట్ తీగల్లో షార్ట్ సర్క్యూ ట్ కారణంగా మంటలు చెలరేగగా.. 9 అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.