టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన డియర్ కామ్రేడ్ సినిమా హిందీలో రికార్డులు క్రియేట్ చేసింది. హిందీలోకి డబ్బింగ్ (Dear Comrade Hindi Dubbed Full Movie) అయి 2 మిలియన్ల లైక్స్ సొంతం చేసుకున్న తొలి భారత సినిమాగా రికార్డు తన ఖాతాలో వేసుకుంది.
టాలీవుడ్ దర్శకులు ఇతర రచయితల కథలను దోచుకుంటున్నారని సాహిత్య అకాడమీ యువ పురస్కార్ విజేత వేంపల్లి గంగాధర్ ( Vempalli Gangadhar ) ఆరోపించారు. గంగాధర్ రాసిన ‘తమిళ కూలీ’ ( Tamila Coolie ) అనే కథలో చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు ( Red Sandal smuggling ) వచ్చిన తమిళ కూలీలపై కేసు గురించి ఉంటుంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) 30వ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడనే సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హరిక & హాసిని క్రియేషన్స్, అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
అల్లు అర్జున్ ( Allu Arjun ) తరువాత చిత్రం పుష్ప ( Pushpa movie ) ప్రకటించినప్పటి నుండి అభిమానులలో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రముఖ పోర్టల్‌లో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ( Shraddha Kapoor ) ప్రత్యేక పాటలో కనిపించి బన్ని అభిమానులను కనువిందు చేయనుంది.
కన్నడ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శాండల్ వుడ్ అందాల భామ రష్మికా మందన్నా దక్షిణ భారతదేశంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొంది. కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ' ద్వారా 2016 లో నటనా రంగ ప్రవేశం చేసిన రష్మిక కన్నడ, తెలుగు సినిమాల్లో నటనకు అనేక ప్రశంసలు అందుకుంది.
సినీ నటి రష్మిక మందన్నపై చేసిన కామెంట్ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. జగిత్యాల కలెక్టర్ ఖాతాను నిర్వహిస్తున్న ఇద్దరిని సస్పెండ్ చేయగా, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కొద్ది రోజులుగా హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న హీరో నితిన్ కు .. 'బీష్మ' చిత్రం ఆ కోరిక తీర్చేలా కనిపిస్తోంది. ' శ్రీనివాస కళ్యాణం' చిత్రం అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో .. నితిన్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా హీరో నితిన్ నటించిన చిత్రం 'బీష్మ'. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు అందించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా కలెక్షన్లలో రికార్డులు సాధిస్తూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో ముందు వరుసలో నిలిచింది.
హీరోయిన్ రష్మిక మందన్న మంగళవారం ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు. కర్నాటకకు చెందిన రష్మిక సొంత గ్రామం కొడుగు జిల్లా విరాజ్ పేట్ లోని తన ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో రష్మిక నివాసం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు రూ.25 లక్షల నగదు, వివిధ ఆస్తులకు సంబందించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
'సరిలేరు నీకెవ్వరు' అంటూ తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న కన్నడ భామ రష్మిక మందన్న. వరుసగా సూపర్ హిట్ లు తన ఖాతాలో వేసుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది.
అనిల్ రావుపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బ్రహ్మాండమైన కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ భారీగా వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి వారంలో
మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్‌ని ఉత్కంఠకు గురిచేస్తోన్న చిత్రాల్లో ఒకటనే సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే సంక్రాంతికి అభిమానుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
నటుడు విజయ్ దేవరకొండకు గీత గోవిందం సినిమా మరిచిపోలేని సక్సెస్ అందించింది. ఇప్పటికే పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా గీత గోవిందం సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లోనూ ప్రవేశించడం అభినందించదగిన విషయం. బాక్సాఫీస్ వర్గాలు వెల్లడిస్తోన్న సమాచారం ప్రకారం.. చిన్న సినిమాగా రిలీజైన గీత గోవిందం సినిమా రెండో వారంలోనే రూ.100 కోట్ల క్లబ్లో ప్రవేశించింది.
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి వంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ తాజాగా వచ్చిన గీత గోవిందంతో సినిమానూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ సినిమాలను అభిమానించే వారి బాజితాలో సాధారణ ఆడియెన్స్ మాత్రమే కాకుండా సినీస రాజకీయ ప్రముఖులు సైతం చేరిపోయారు. ఇప్పటికే గీత గోవిందం సినిమాకు ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద సినీ ప్రముఖులందరి నుంచి ప్రశంసలు రాగా తాజాగా టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా విజయ్ దేవరకొండను, ఆ చిత్ర బృందాన్ని అభినందించారు. తనని కలిసిన చిత్ర యూనిట్ తో కవిత మాట్లాడుతూ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.