పేరు కాదు.. తినే ఆహారం. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తిరుమల దుకాణాదారులు దెబ్బకు దిగివచ్చారు. తిరుమల వచ్చిన భక్తులు దేవుణ్ణి దర్శించుకొని కానుకలు ఇద్దాం అని వస్తే.. అక్కడి హోటళ్లు భగవంతుని వద్దకు వెళ్లకుండానే నిలువుదోపిడీ చేసేవారు. ఈ అంశంపై కొందరు భక్తులు హైకోర్టులో పిటీషన్ వేశారు. హైకోర్టు హోటల్ యజమానులకు మొట్టికాయ వేసింది. దాంతో రంగంలోకి టీటీడీ అధికారులు దిగి, హోటళ్ల ముందు ధరల పట్టిక ఉంచేలా చర్యలు చేపట్టారు.
ప్రజా సంకల్ప యాత్రకు బయలుదేరే ముందు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తెల్లవారుజామున నైవేద్య సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఆతరువాత రంగనాయకులు మండపం చేరుకొని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంట ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు ఉన్నారు.
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.