2017 సంవత్సరానికి గాను తిరుమల తిరుపతిలో తలనీలాల ద్వారా దేవాలయానికి ఎంత ఆదాయం వచ్చిందో ఆ వివరాలను టిటిడి జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు.ఈ తలనీలాలను వివిధ రకాలుగా వర్గీకరించి ఈవేలం నిర్వహించారు. ఇందులో అత్యుత్తమ రకం కిలో రూ.రూ.22,494/- పలికింది.
అలాగే ద్వితీయ శ్రేణి రకం కిలో రూ.17,223/-పలికింది. మూడవ శ్రేణి రకం రూ.2,833/- పలకగా, నాలుగో శ్రేణి రకం రూ.1,195/- పలికాయి. అన్నింటికన్నా తక్కువగా అయిదవ శ్రేణి రకం కిలో రూ.24/- పలికింది. తలనీలాల ఇంచులను బట్టి శ్రేణిని వర్గీకరించడం జరగింది.
అన్ని రకాలు దాదాపు 600 కిలోలకు పైగా అమ్ముడవ్వగా.. కిలో రూ.24/-గా ఉన్న రకం మాత్రం 1,93,000 కిలోలు అమ్ముడవ్వడం గమనార్హం. ఈ తల నీలాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.6.39 కోట్లు రూపాయలని టిటిడి ఈవో వెల్లడించారు