Weather Update: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఓ పక్క భానుడి భగభగలు కొనసాగుతుంటే..మరోవైపు చిరు జల్లులు కురుస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇటు సాయంత్రం వేళల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో నెల రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది.
రాజకీయాల్లోకి వచ్చేదే లేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి స్పష్టంచేశారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను రాజకీయాల్లోకి రాలేనని, దయచేసి తనను ఒత్తిడి చేయొద్దంటూ అభిమానులకు రజనీకాంత్ (Rajinikanth) విజ్ఞప్తి చేశారు.
తమిళనాడులో ( Tamil Nadu ) లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) జరిగింది. ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో నలుగురు మృతి చెందారు.
Paints Govt school veranda as train compartments: విద్యార్థులు తమ స్కూళ్లకు రావాలని అధికంగా ప్రైవేట్ యాజమాన్యాలు భావిస్తుంటాయి. అందుకు తగ్గట్లుగా జిమ్మిక్కులు సైతం ప్రదర్శిస్తుంటాయి. అవసరమైతే విద్యార్థుల ఇళ్లు వెళ్లి స్కూల్‌కు ఎందుకు రావడం లేదని ఆరాతీసి మరి తమ స్కూళ్లలో చేర్చుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ప్రభుత్వ పాఠశాలల విషయానికొస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
తమిళనాడు (Tamil nadu) దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ (V. K. Sasikala) అవినీతి, అక్రమాస్తుల కేసులో 2017 నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె త్వరలోనే జైలు నుంచి విడుదల కావడానికి మార్గం సుగమం అయింది.
Actor Vijay Political Entry | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్థాపించే పార్టీలో తాను చేరబోవడం లేదని ఇటీవల తలపథి విజయ్ స్పష్టం చేశారు. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్థాపించబోయే పార్టీలో విజయ్ చేరకూడదని ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ మరోసారి తీర్మానించింది.
తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (tamil nadu 2021 election) కోలాహలం మొదలైంది. 2021 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్నా ఆకాంక్షతో తమిళనాడులోని ప్రాధాన పార్టీలన్నీ ఇప్పటికే దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ (Kamal Haasan).. అసెంబ్లీ ఎన్నికల్లో పొటీపై కీలక ప్రకటన చేశారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి సైతం కరోనాబారిన పడి కన్నుమూశారు.
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బాణసంచా కర్మాగారం (crackers factory) లో భారీ పేలుడు సంభవించడంతో ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల (Five dead and three injured) పాలయ్యారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు ఐటీ శాఖ నుంచి భారీ షాక్ తగిలింది. ఓ వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు మూడు నెలల్లో శశికళ జైలు నుంచి విడుదల కానున్న తరుణంలో ఆమెతోపాటు ఆమె బంధువులకు చెందిన రూ.2వేల కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది.
‘హిందీ రాదా.. హిందీ మాట్లాడలేవా... అయితే నీకు లోన్ ఇవ్వలేను’ (Bank Loan Rejected For Not Knowing Hindi) అని బ్యాంకు మేనేజర్ చేసిన కామెంట్స్ దక్షిణాదిన కలకలం రేపుతున్నాయి. మరోవైపు మాకు హిందీ వద్దు అని ఉద్యమం నడుస్తోంది.
Explosion in a firecracker factory | విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుళ్లు సంభవించడంతో 9 మంది మరణించారు. దీపావళి పండుగకు బాణాసంచా తయారు చేస్తుంటే ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
తమిళనాడు (tamil nadu) గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ (Banwarilal Purohit ) ఆగస్టు 2న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం కరోనావైరస్ (Coronavirus) నుంచి కోలుకున్నారు.
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం-2020 లోని మూడు భాషల సూత్రాన్ని తమిళనాడు ( TamilNadu ) రాష్ట్రం వ్యతిరేకిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళనిస్వామి ( Edappadi K. Palaniswami) ప్రకటించారు.
తమిళనాడు ప్రజలు సామాజిక దూరం(Cosial Distancing) నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. ముఖ్యంగా మధురైలో సోషల్ డిస్టాన్సింగ్ పాటించకుండా మందు దొరికితే చాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వయసు పైబడిన వారే సగానికి పైగా ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా తీవ్రతను కాస్తయినా ఆపవచ్చు. ఆకలికష్టాలు తప్పించాలని భావించిన ప్రభుత్వం జూన్ 30వరకు ఉచితంగా భోజనం అందిస్తోంది.
తమిళనాడులోని ఓ ప్రాచీన దేవాలయంలో లంకె బిందె బయటపడింది. ఆలయంలో తవ్వకాలు జరుపుతున్న సిబ్బందికి బంగారంతో కూడిన కుండ లభించింది. దీంతో ఇక్కడి ఆలయ ప్రాంగణంలో నిధి నిక్షేపాలు ఉండి వచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.