Fire Boltt Gladiator: ప్రస్తుతం ఫైర్ బోల్ట్ స్మార్ట్‌వాచ్ కంపెనీ ఇండియా మార్కెట్‌లో చాలా పేరు పొందింది. అయితే ఈ కంపెనీ ఇటివలే మరో స్మార్ట్‌వాచ్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఇంతక ముందు లాంచ్ చేసిన వాచ్ ఫీచర్ల కంటే చాలా రకాల కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ అనే పేరుతో మరో వాచ్ కూడా లాంచ్ కాబోతోంది. అల్ట్రా-స్లీక్ మెటాలిక్ ఫ్రేమ్‌లో ప్యాక్‌తో అందుబాటులో ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ టెక్నాలజీతో, 1.96-అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. ఇది Apple Watch Ultra లాంటి పోలికలను కలిగి ఉంటుంది. అయితే ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్‌కి సంబంధించిన ధర, ఫీచర్లను తెలుసుకుందాం..
ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్ స్పెసిఫికేషన్స్:
గ్లాడియేటర్ వాచ్ యాపిల్ వాచ్‌ను పోలి ఉండడమేకాకుండా చాలా రకాల ఫీచర్లతో ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా 600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడా వస్తుంది. దీంతో డిప్లే కూడా ఎండలో కూడా బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా యాపిల్ వాచ్ లాగా వాచ్ పూర్తిగా వాటర్ ప్రూఫ్, డస్ట్, స్క్రాచ్ రెసిస్టెంట్‌తో ఉంటుంది. స్పీకర్ అవుట్‌పుట్ విషయానికొస్తే.. శక్తివంతమైన ఇన్‌బిల్ట్ స్పీకర్‌తో అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ వాచ్ ధర విషయానికొస్తే అన్ని వాచ్‌లా కాకుండా రూ. 3,000 ధరకే లభిస్తుంది.
ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్ బ్యాటరీ:
ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్ శక్తివంతమైన బ్యాటరీతో వస్తోంది. ఏడు రోజుల పాటు ఉండే బ్యాటరీ ఫ్యాకప్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే దాదాపు 24 గంటల పాటు ఉంటుంది. వాచ్‌కు 5 GPS సఫోర్ట్ మోడ్ ఉంటుంది. దీంతో మీరు గేమ్‌లు, కాలిక్యులేటర్, వెదర్ అప్‌డేట్‌లు, డ్రింక్ వాటర్ రిమైండర్, అలారం, కెమెరా నియంత్రణలను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా హార్ట్ బీట్ రేటు, SpO2 ట్రాక్ చేస్తుంది.
ఫైర్-బోల్ట్ గ్లాడియేటర్ ధర:
భారత మార్కెట్‌లో డిసెంబర్ 30 నుంచి Amazon.in, Fire-Bolt వెబ్‌సైట్‌లో లభిస్తోంది. దీని ధర రూ. 2499 ప్రారంభం కాగా ఫీచర్లను బట్టి రేట్లను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఇది నాలుగు వెరియంట్స్‌లో లభించనుంది. అంతేకాకుండా నలుపు, నీలం, లేత బంగారు, బంగారు కలెర్స్‌లో లభిస్తోంది.
Also Read : Ponniyin Selvan 2 Release Date : పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
Also Read : Thalapathy Vijay No 1 Hero : అందుకే విజయ్ నెంబర్ వన్ హీరో.. బల్లగుద్ది చెప్పేసిన దిల్ రాజు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి