Flipkart Big Upgrade Sale: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్ అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా వివిధ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా శాంసంగ్‌కు చెందిన Samsung Galaxy S23 FEచాలా తక్కువ ధరకు లభిస్తోంది. ఏ విధమైన బ్యాంక్ ఆఫర్ లేదా ఎక్స్చేంజ్ ఆఫర్ లేకుండానే 41,999 రూపాయలకు ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy S23 FE అసలు ధర్ 79,999 రూపాయలు. కాని ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ తరువాత ఈ ఫోన్ కేవలం 41,999 రూపాయలే లభించనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్డోరేజ్ ఉంటుంది. ఇందులోనే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ టాప్ ఎండ్ అయితే 46,999 రూపాయలుగా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐతో కొనుగోలు చేస్తే 3,500 రూపాయలు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకు కార్డులపై కూడా ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా 38 వేల రూపాయలతో పాటు అదనంగా 2 వేల రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు.
Samsung Galaxy S23 FE ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో పాటు 6.4 ఇంచెస్ పుల్ హెచ్డి ప్లస్ డైనమిక్ ఎమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లేతో వస్తోంది. ఇందులో ఆక్టాకోర్ ఎక్సినోస్ 2200 ప్రోసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా వన్ యూఐ 6తో నడుస్తుంది. ఈ ఫోన్లో 25 వాట్స్ వైర్డ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్ బ్యాటరీ 4500 ఎంఏహెచ్ ఉంటుంది. ఇక కెమేరా గురించి పరిశీలిస్తే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ ప్లస్ 8 మెగాపిక్సెల్ టెలీఫోటో, 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటాయి. వైఫై 6 కనెక్టివిటీ ఉంటుంది. 5.3 బ్లూటూత్ యాక్సెస్ ఉంటుంది.
Also read: Toyota Taisor: టయోటా నుంచి మరో అదిరిపోయే కారు.. లాంచ్ డేట్, ఫీచర్స్ వివరాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook