Flipkart Smart Tv Best Offer: చివరి గంటల్లో భారీ ఆఫర్స్‌.. సాంసంగ్‌ స్మార్ట్‌టీవీ కేవలం రూ.10 వేలకే!

Flipkart Smart Tv Best Offer: అత్యంత తగ్గింపు ధరతో మంచి స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలని వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్ బిలియన్ సేల్ లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి అదనంగా వాటిపై ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి...

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 6, 2024, 09:00 PM IST
Flipkart Smart Tv Best Offer: చివరి గంటల్లో భారీ ఆఫర్స్‌.. సాంసంగ్‌ స్మార్ట్‌టీవీ కేవలం రూ.10 వేలకే!

Flipkart Smart Tv Best Offer: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈరోజే బిగ్ బిలియన్ సేల్ చివరి రోజు.. దీంతో కొన్ని రకాల ఎలక్ట్రిక్ పరికరాలపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ ను ఫ్లిఫ్‌కార్ట్‌  అందిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్ చివరి గంటల్లో మొబైల్స్, స్మార్ట్ టీవీలు కొనుగోలు చేసే వారికి అత్యధిక తగ్గింపు ధరతో విక్రయిస్తోంది. అయితే ఫ్లిప్కార్ట్ లో ఈ రోజే బిగ్ బిలియన్ సేల్ చివరి రోజు కావడంతో స్మార్ట్ టీవీలపై అత్యధిక డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ముఖ్యంగా వీటిపై బ్యాంక్ ఆఫర్స్ తో పాటు అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 32 అంగుళాల టీవీ లపై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. బిగ్ బిలియన్ డేస్ చివరి గంటల్లో ఏ టీవీ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

గతంలో సాంసంగ్ కంపెనీ విడుదల చేసిన 32 అంగుళాల ఎల్ఈడి స్మార్ట్ డైజేషన్ స్మార్ట్ టీవీ (SAMSUNG 80 cm HD Ready LED Smart Tizen TV) పై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు మరెన్నో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ టీవీ రెండు వేరియంట్లలో పాటు మరో రెండు టెక్నాలజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో బేస్ వేరియంట్ హెచ్డి రెడీ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ టీవీ రూ. 18,999లకు అందుబాటులో ఉంది. అయితే ఈ రోజే ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఇది 41 శాతం ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ.10,999కే పొందవచ్చు. ఇవే కాకుండా దీనిపై అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ను వినియోగించాలనుకునే వారు ముందుగా కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 

ఇక ఈ (SAMSUNG 80 cm HD Ready LED Smart Tizen TV)  స్మార్ట్ టీవీ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలు లోకి వెళితే.. దీనిని కొనుగోలు చేసే క్రమంలో HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఇదే బ్యాంకుకు సంబంధించిన డెబిట్ కార్డు పై కూడా డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అలాగే ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి కొనుగోలు చేసే వారికి ఐదు శాతం కు పైగా తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి ఈఎంఐ ఆప్షన్ చూస్ చేసుకునేవారికి నో కాస్ట్ కూడా లభిస్తుంది. అదనంగా ఈ స్మార్ట్ టీవీ పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ను వినియోగించే వారికి మరింత తగ్గింపు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
Full HD రిజల్యూషన్
Smart Tizen OS
అప్లికేషన్‌లను యాక్సెస్
Wi-Fi కనెక్టివిటీ
బాస్ ఎన్హాన్స్
PurColor
వాయిస్ అసిస్టెంట్‌ ఫీచర్‌
వాల్ మౌంట్ కెపబిల్‌
స్టైలిష్ డిజైన్‌

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News