OnePlus 12R - Oneplus 12 Price: ప్రముఖ టెక్ కంపెనీ వన్‌ప్లస్ సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కూడిన మొబైల్‌ను ఎప్పటికప్పుడు మార్కెట్‌లో విక్రయిస్తోంది. దీంతో పాటు టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త మోడల్స్‌లో మొబైల్స్‌ను లాంచ్ చేస్తోంది. గత వారం వన్‌ప్లస్ 12 ఆర్‌ను విడుదల చేసిన సంగంతి అందరికీ తెలిసిందే. దీంతో పాటు కంపెనీ వన్‌ప్లస్ బడ్స్ 3ని కూడా గ్లోబల్ లాంచ్ చేసింది. అలాగే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న OnePlus 12 మొబైల్స్ విక్రయాను కూడా మార్కెట్‌లో ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మొబైల్ సిల్కీ బ్లాక్‌తో పాటు ఫ్లోవీ ఎమరాల్డ్ కలర్స్ ఆప్షన్స్‌లో లభిస్తున్నాయి. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ధర, డిస్కౌంట్ వివరాలు:
ప్రస్తుతం ఈ OnePlus 12, OnePlus 12R మొబైల్స్ రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ 12 మొబైల్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ 64,999లకు లభిస్తోంది. దీంతో పాటు 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ కూడా అదుబాటులో ఉంది. దీని ధర రూ 69,999లకు లభిస్తోంది. ఇక OnePlus 12R వివరాల్లోకి వెళితే ఈ స్మార్ట్‌ఫోన్ కూడా రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో లభిస్తోంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ కలిగిన దీని ధర రూ 39,999లకు లభిస్తోంది. దీంతో పాటు 16GB ర్యామ్, 256GB ఇంటర్నల్ ఆప్షన్ ఉన్న మొబైల్ రూ 45,999తో అందుబాటులో ఉంది.
ఈ రెండు మోడల్స్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌తో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసేవారు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసిన డిస్కౌంట్ పొందవచ్చు. ప్రస్తుతం ఈ OnePlus 12, OnePlus 12R స్మార్ట్‌ఫోన్స్ అమెజాన్‌తో పాటు వన్‌ప్టస్.ఇన్, వన్‌ప్టస్ స్టోర్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లు, రిలయన్స్ డిజిటల్, క్రోమా స్టోర్స్‌లో అందుబాటు ఉన్నాయి.
OnePlus 12 స్పెసిఫికేషన్‌లు:
ఈ OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 6.82 అంగుళాల క్వాడ్ HD+ LTPO 4.0 AMOLED డిస్ల్పేతో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ ట్రిపుల్ రియర్ కెమెరాను కలిగి ఉంటుంది. బ్యాక్ సెటప్‌లో 50MP బ్యాక్ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ కెమెరా, 64MP పెరిస్కోప్ టెలిఫోటో సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 32MP ఫ్రంట్ కెమెరాతో రాబోతోంది. ఈ మొబైల్ 100W SuperVOOC ఛార్జింగ్‌తో 5,400mAh బ్యాటరీ సెటప్‌తో లభిస్తోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 14పై రన్ అవుతుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
OnePlus 12R స్పెసిఫికేషన్స్:
ఈ OnePlus 12R 6.78 అంగుళాల 1.5K LTPO 4.0 AMOLED డిస్ల్పేతో లభిస్తోంది. దీంతో పాటు స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. అలాగే ట్రిపుల్ వెనుక కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు 5,000mAh బ్యాటరీ, 100W SuperVOOC వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఈ మొబైల్ అనేక రకాల కొత్త శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter