Oppo F25 Pro Price And Specifications: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో గుడ్ న్యూస్ తెలిపింది. కంపెనీ ఇటీవలే ప్రకటించిన F25 Pro 5G మోడల్‌ను ఫిబ్రవరి 29న భారతదేశంలో లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. అయితే లాంచింగ్‌కి ముందే కంపెనీ కలర్ ఆప్షన్స్, డిజైన్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇప్పటికే ప్రముఖ టిప్‌స్టర్ ఈ మొబైల్‌కి సంబంధించిన ధరతో పాటు కాన్ఫిగరేషన్, చిప్‌సెట్, బ్యాటరీ వివరాలను కూడా ప్రకటించారు. అంతేకాకుండా ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మొబైల్‌కి సంబంధించిన పోస్టర్ కూడా ప్రత్యేక్షమవుతోంది. అయితే ఈ Oppo F25 Pro 5G మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రముఖ టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్ సోషల్ మీడియా xలో తెలిపిన వివరాల ప్రకారం..ఈ Oppo F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో మొదటిది 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే..రెండవది 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను కలిగి ఉంటుందని తెలిపారు. మొదట ఈ మొబైల్‌ను రూ.22,999 ధరతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసేవారికి అదనంగా 10 శాతం తగ్గింపును కూడా అందించబోతున్నట్లు సమాచారం.
టిప్‌స్టర్ ప్రకారం తెలిపిన వివరాల ప్రకారం ఈ Oppo F25 Pro 5G మొబైల్ ఎంతో శక్తివంతమైన MediaTek డైమెన్సిటీ 7050 SoC ప్రాసెసర్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఆండ్రాయిడ్ 14-ఆధారిత UI అవుట్ ఆఫ్ ది బాక్స్‌పై రన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ ఫుల్ హెచ్‌డీతో కూడిన డిస్ల్పేను కలిగి ఉంటుంది. అలాగే 1,100నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో రాబోతోంది.
ఒప్పో తమ యూజర్స్‌కి బంఫర్ లక్కీ డ్రాను కూడా అందిస్తోంది. ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌లో లక్కీ డ్రా సెగ్మెంట్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. ఈ లక్కీ డ్రాలో పార్టిసిపెంట్‌లకు Oppo F25 Pro 5Gతో పాటు Oppo Enco Buds 2ని ఫ్రీగా అందిచబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఈ మొబైల్‌ను కంపెనీ రెండు కలర్ ఆప్షన్‌లతో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది.
Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
పాండా గ్లాస్ ప్రొటెక్షన్
64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా
8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా
2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా
32 మెగాపిక్సెల్ ఫ్రాంట్ కెమెరా
Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter