Vivo X100 Pro Price: ఎప్పటి నుంచో అందరూ ఎంగానో ఎదురు చూస్తున్న వీవో X100 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ భారత్‌లో లాంచ్ అయ్యాయి. వీవో కంపెనీ Vivo X100 Pro, X100 పేర్లతో విడుదల చేసింది. గరిష్టంగా ఈ రెండు మొబైల్స్‌ను 16 GB ర్యామ్ వేరియంట్స్‌తో కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాను ZEISS భాగస్వామ్యంతో తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ మొబైల్ 100x వరకు జూమ్‌ని క్యాప్చర్ చేస్తుంది. దీంతో పాటు అతి శక్తివంతమైన టెలిఫోటో సన్‌షాట్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు చాలా రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వీవో X100 Pro, X100 స్మార్ట్ ఫోన్ MediaTek డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌తో మార్కెట్‌లో మొట్టమొదటి సారిగా విడుదలైంది. వీవో భారత్‌లో Vivo X100 Proని 16GB + 512GB స్టోరేజ్ ఆప్షన్స్‌తో అందుబాటుకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.89,999లతో అందుబాటులో ఉంది. ఇక Vivo X100 స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే..ఈ మొబైల్ ప్రారంభ ధర 12GB+256GB రూ.63,999కాగా..16GB + 512GB వేరియంట్ ధర రూ.69,999తో లభించనుంది.
దీంతో పాటు వీవో ఈ స్మార్ట్ ఫోన్‌పై 24 నెలల నో-కాస్ట్ EMIతో పాటు జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు వీవో అధికారిక వెబ్‌సైట్‌లో ICICI, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు HDFC, SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లపై EMI ట్రాన్‌క్షన్స్‌పై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ వీవో X100 Pro, X100 స్మార్ట్ ఫోన్స్ ప్రీబుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించింది. అయితే అధికారిక సమాచారం ప్రకారం జనవరి 11 నుంచి ఈ మొబైల్స్ మార్కెట్‌లోని అన్ని స్టోర్స్‌లో లభించనున్నాయి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
Vivo X100 Pro, X100 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:
✤ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్
✤ Android 14 ఆధారంగా Funtouch OS 14
✤ 6.78 అంగుళాల AMOLED 8T LTPO కర్వ్డ్ డిస్‌ప్లే
✤ 3000నిట్స్ గరిష్టమైన బ్రైట్‌నెస్
✤ 120Hz వరకు రిఫ్రెష్ రేట్
✤ MediaTek డైమెన్సిటీ 9300 ప్రాసెసర్
✤ V3 ఇమేజింగ్ చిప్
✤ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
✤ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సెన్సార్
✤ 50 మెగాపిక్సెల్ Sony IMX989 కెమెరా
✤ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా
✤ 50 మెగాపిక్సెల్ సూపర్ టెలిఫోటో కెమెరా
✤ 4.3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్
✤ 100x డిజిటల్ జూమ్
✤ 32MP సెల్ఫీ కెమెరా
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter