హైదరాబాద్: గత రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్యాలయాల సోదాల్లో కీలక విషయాలు బయటపడ్డాయని, టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంతో పాటు అవినీతికి పాల్పడినట్లుగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. సుమారుగా 100 మంది టౌన్ ప్లానింగ్ అధికారులపై శాఖాపరమైన చర్యలకు ఏసీబీ సిఫారసు చేసినట్లు తెలిపారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ వందమంది అధికారులపై చర్యలు తీసుకోవాలని, కొంతమంది టౌన్ ప్లానింగ్ అధికారులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఏసీబీ తెలిపింది.
భవన నిర్మాణాలకు అనుమతులపై విచ్చలవిడిగా వ్యవహరించడం, అక్రమ కట్టడాలపై ఉదాసీనతగా వ్యవహరించడం వంటి వాటిపై శాఖాపరమైన చర్యలు, ఆ తర్వాత కేసులు నమోదు చేసి విచారణ కు రంగం సిద్ధం చేయనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..