Munugode Bypoll: 40 ఎకరాలు ఆక్రమించిన కూసుకుంట్ల! ఆధారాలున్నాయంటున్న బీజేపీ.. మునుగోడు టీఆర్ఎస్ లో కలకలం

Munugode Bypoll: మునుగోడు ప్రచారంలో  నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు నేతలు. పరస్పర సవాళ్లు చేసుకుంటున్నారు.కేసీఆర్  దోపిడీ పాలనకు చరమగీతం పాడటానికి మునుగోడులో బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు ఈటల రాజేందర్.

Written by - Srisailam | Last Updated : Oct 12, 2022, 02:34 PM IST
  • మునుగోడులో జోరందుకున్న ప్రచారం
  • టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం
  • కూసుకుంట్లపై బీజేపీ భూ కబ్జా ఆరోపణలు
Munugode Bypoll: 40 ఎకరాలు ఆక్రమించిన కూసుకుంట్ల! ఆధారాలున్నాయంటున్న బీజేపీ.. మునుగోడు టీఆర్ఎస్ లో కలకలం

Munugode Bypoll:  మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈనెల 14 వరకు నామినేషన్ల గడువుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ప్రధాన పార్టీల నేతలంతా మునుగోడులోనే మకాం వేశారు. అధికార పార్టీకి చెందిన 14 మంది మంత్రులు.. 76 మంది ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ మద్దతుగా ఆ పార్టీ నేతలంతా తరలివచ్చారు. పీసీసీ ముఖ్యనేతలను మునుగోడులోనే మోహరించారు. ప్రచారంలో భాగంగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు నేతలు. పరస్పర సవాళ్లు చేసుకుంటున్నారు.

చౌటుప్పల్ మండలంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి ప్రచారం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఈటల తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ దిగజారిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. తండ్రి బాటలోనే కేటీఆర్ నడుస్తున్నారని చెప్పారు. కుటుంబ పాలన మీద సమాధానం చెప్పలేక చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. టీఆర్ఎస్ రాక ముందే రాజగోపాల్ రెడ్డి బడా కాంట్రాక్టర్ అని.. ఉద్యమ సమయంలో కేసీఆర్ కు డబ్బుల సాయం కూడా చేశారని చెప్పారు. టెండర్లలో కాంట్రాక్ట్ వస్తే రాద్దాంతం చేయడం ఏంటన్నారు. తెలంగాణలో కాంట్రాక్టులను టెండర్లు లేకుండాన అప్పగిస్తున్నారా.. అలా చేయడం సాధ్యమేనా అని రాజేదంర్ ప్రశ్నించారు. కాంట్రాక్ట్ విషయంలో తడి బట్టలతో వచ్చి యాదగిరిగుట్ట ఆలయంలో ప్రమాణం చేయడానికి రాజగోపాల్ రెడ్డి సిద్ధమని.. అందుకు కేసీఆర్ , కేటీఆర్ సిద్ధమా అని సవాల్ చేశారు. అబద్దాలతో తెలంగాణ ప్రజలకు ఇంకా కేసీఆర్ మోసం చేయలేరన్నారు.

ఉప ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి నిధులు ఇస్తారని తెలంగాణ ప్రజలందరికి తెలిసిపోయిందన్నారు రాజేందర్. మునుగోడులో అన్ని గ్రామాలను దావత్ లకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఓటమి ఖాయమని తేలడంతో వ్యక్తిగత విమర్శలు చేయిస్తూ చిల్లర రాజకీయం చేస్తున్నారని ఈటల ధ్వజమెత్తారు. మర్రిగుడెం మండలంలో 40 ఎకరాల భూమిని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో  ఆక్రమించుకున్నారని రాజేందర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి బెదిరింపులతో భూయజమానులు లొంగిపోయారని అన్నారు. మునుగోడు పోరు కేసీఆర్ కు గుణపాఠం కావాలన్నారు. కేసీఆర్  దోపిడీ పాలనకు చరమగీతం పాడటానికి మునుగోడులో బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు ఈటల రాజేందర్.

Also Read : Munugode Bypoll Money: హైదరాబాద్ లో 10 కోట్ల  డబ్బు సీజ్.. మునుగోడు కోసమే తెచ్చారా?

Also Read : Munugode Bypoll: మునుగోడులో 25 వేల దొంగ ఓట్లు? ఎవరు చేర్పించారు.. ఏం జరిగింది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News