Telangana Politics: ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకప్పుడు బీఆర్‌ఎస్ పార్టీకి కుంచుకోట. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కంచుకోటను కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టింది. ముఖ్యంగా జిల్లాలో అత్యంత సీనియర్ నేతలంతా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇందులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఒకరు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావును కాంగ్రెస్ నేత యశస్విని రెడ్డి చిత్తుచిత్తుగా ఓడించారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇన్నాళ్లు బయటకు రానీ మాజీమంత్రి.. ఓటమి బాధ నుంచి తెరుకుని ఇప్పుడిప్పుడే పొలిటికల్‌గా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతలోపే ఎర్రబెల్లికి మరో షాక్ ఇచ్చారు సొంత పార్టీకి చెందిన కొందరు లీడర్లు..
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు పాలకుర్తికి పెద్దదిక్కుగా ఉన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఓటమి ఎరుగని నేతగా వరంగల్‌లో గుర్తింపు దక్కించుకున్న ఆయన.. గత ఎన్నికల్లో తొలిసారి ఓటమి చవిచూశారు. గత ఎన్నికల్లో పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన ఝాన్సీరెడ్డి కోడలు యశస్విని రెడ్డి భారీ విజయం సాధించారు. అప్పటినుంచి పాలకుర్తిలో పట్టు సాధించుకునేందుకు ఝాన్సీరెడ్డి అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే.. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులే టార్గెట్‌గా ఆమె పావులు కదుపుతున్నారు. తాజాగా పాలకుర్తిలో బీఆర్ఎస్‌కు చెందిన కీలక లీడర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలోనే మరికొందరు లీడర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డి వరుస షాక్‌లతో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కకావికలం అవుతున్నట్టు తెలుస్తోంది. తన అనుచరులను ఎలా కాపాడుకోవాలో తెలియక పరేషాన్ అవుతున్నట్టు సమాచారం. తన రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించినా రాజకీయంగా జరుగుతున్న నష్టాన్ని మాత్రం నివారించలేకపోతున్నారట. ఇదే సమయంలో తన రాజకీయ భవిష్యత్తును ఊహించుకుంటూ లోలోన కుమిలిపోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్నంతా రంగరించినా.. కనీసం అనుచరులను కూడా కాపాడుకోలేక పోతున్నానని లోలోన మదనపడిపోతున్నారట. అయితే ఈ నష్ట నివారణను ఎలా నియంత్రిచాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
Also Read: Kiran Royal illegal Affairs: జనసేన నేత కిరణ్ రాయల్ భాగోతాలు త్వరలో సస్పెన్షన్ వేటు
Also Read: Tirumala: తిరుమల భక్తులకు అలెర్ట్.. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter