/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

Harish Rao Mallanna Sagar: లక్షలాది ఎకరాలను తడుపుతున్న కాళేశ్వరంపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం తప్పని రుజువైనట్లు బీఆర్ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. 'కేసీఆర్ కట్టించిన మల్లన్న సాగర్ 21 టీఎంసీల నీటితో ఒక సముద్రంలాగా కనిపిస్తుంటే కడుపు నిండినంత సంతోషం కలిగింది' అని పేర్కొన్నారు. మల్లన్న సాగర్‌కు రికార్డు స్థాయిలో 21 టీఎంసీల నీరు విడుదలైన సందర్భంగా గురువారం హరీశ్‌ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం జలాలకు మొక్కులు సమర్పించుకున్నారు.

Also Read: Pawan Kalyan: నాగుపాము ఉంగరం ధరించిన డిప్యూటీ సీఎం పవన్‌.. ఆ రింగ్‌ ధరిస్తే ఏమవుతదో తెలుసా?

 

'కేసీఆర్ కట్టించిన మల్లన్న సాగర్  21 టీఎంసీల నీటితో ఒక సముద్రంలాగా కనిపిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసి కడుపు నిండినంత సంతోషం కలిగింది. కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని, కాళేశ్వరం మునిగిపోయిందనే వాళ్లకి చెంపపెట్టులాంటి సమాధానం ఈ నిండిన మల్లన్న సాగర్ చెబుతున్నది. రూ.లక్ష కోట్లు వృథా అయిందని.. కాళేశ్వరం ప్రాజెక్టు పోయిందని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు అబద్ధం అని గలగల పారుతున్న గోదావరి నీళ్లే సమాధానం చెబుతున్నాయి. కాళేశ్వరం కొట్టుకుపోయి ఉంటే ఈరోజు మల్లన్న సాగర్‌లో 21 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నాను?' అని హరీశ్ రావు తెలిపారు.

Also Read: KTR Harish Rao: కేటీఆర్‌, హరీశ్‌ రావు మధ్య విభేదాలు? ఒకే వేదిక పంచుకోని నేతలు

 

'ఎల్లంపల్లి, లక్ష్మీ బ్యారేజ్, అన్నపూర్ణ బ్యారేజ్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లలో గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండడంతోనే సాధ్యమైంది. మల్లన్న సాగర్ నిండుకుండలా ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదా అని అడుగుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు కింద పండే ప్రతీ పంటలో కేసీఆర్ పేరు ఉంది. ప్రతీ రైతు గుండెల్లో కేసీఆర్ పేరు నిలబడి ఉంటది. కాళేశ్వరం కొట్టుకుపోయిందనే మూర్ఖపు ప్రచారాన్ని కాంగ్రెస్ మానుకోవాలి' అని హరీశ్ రావు హితవు పలికారు.

'కేసీఆర్ కట్టించినటువంటి అన్నపూర్ణలో 3 టీఎంసీలు, రంగనాయక సాగర్‌లో 3 టీఎంసీలు, మల్లన్న సాగర్‌లో 21 టీఎంసీలు నింపుకున్నాం. కొండపోచమ్మలో 10 టీఎంసీల నీళ్లు నింపుకున్నామంటే ఇది కేసీఆర్ కృషి వల్లే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికి దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌వి డైవర్షన్ పాలిటిక్స్. మాదేమో రైతులకు నీళ్లు ఇయ్యాలనే తపన. మాది వాటర్ డైవర్షన్, కాంగ్రెస్ దేమో  అటెన్షన్ డైవర్షన్' అని హరీశ్ రావు తెలిపారు.

'21 టీఎంసీలతో సముద్రాన్ని తలపించే మల్లన్న సాగరే కాళేశ్వరానికి సజీవ సాక్ష్యం. దీనిపై దుష్ప్రచారం తగదు' అని హరీశ్ రావు పేర్కొన్నారు. 'కాంగ్రెస్ నాయకులు మీరు కూడా వచ్చి మల్లన్న సాగర్‌లో ఇంత పసుపు కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి' అని కాంగ్రెస్‌ పార్టీకి కౌంటర్‌ ఇచ్చారు. 'మెదక్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల్లో పంటలు పండడం మీకు ఇష్టం లేదా? రైతుల పొలాలు పండడం మీకు ఇష్టం లేదా?' అని సూటిగా ప్రశ్నించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Section: 
English Title: 
Ex Minister Harish Rao Strong Counter On Kaleshwaram Project Damaged Allegations He Fires On Revanth Reddy Rv
News Source: 
Home Title: 

Harish Rao: 'మాది వాటర్ డైవర్షన్, కాంగ్రెసోళ్లది అటెన్షన్ డైవర్షన్'.. రేవంత్‌కు హరీశ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Harish Rao: 'మాది వాటర్ డైవర్షన్, కాంగ్రెసోళ్లది అటెన్షన్ డైవర్షన్'.. రేవంత్‌కు హరీశ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌
Caption: 
Harish Rao Mallanna Sagar Visit (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
'మాది వాటర్ డైవర్షన్, కాంగ్రెసోళ్లది అటెన్షన్ డైవర్షన్'.. రేవంత్‌కు హరీశ్‌ కౌంటర్
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Friday, September 20, 2024 - 22:06
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
10
Is Breaking News: 
No
Word Count: 
343