Free Bus: మహా శివరాత్రి ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ఉందా?

Free Bus Cancel Rumours In Maha Shivaratri Special Buses: మహా శివరాత్రిని పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. శైవ క్షేత్రాల సందర్శన ఏర్పాటుచేసిన బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా లేదా? తెలుసుకోండి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 22, 2025, 08:27 PM IST
Free Bus: మహా శివరాత్రి ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ఉందా?

Maha Shivaratri Special Buses: అతి పరమపవిత్రమైన మహా శివరాత్రి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని భక్తులకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త ప్రకటించింది. ర‌వాణాపరంగా అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా టీజీఎస్ఆర్టీసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. శైవ క్షేత్రాలను సందర్శించాలనుకునే భ‌క్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 3 వేల ప్రత్యేక బస్సులను న‌డుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 26వ తేదీన మ‌హా శివ‌రాత్రి కాగా.. 24 నుంచి 28వ తేదీ వ‌ర‌కు ఈ ప్ర‌త్యేక బ‌స్సులు అందుబాటులోకి రానున్నాయి.

Also Read: PM Modi Phone Call: ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై రేవంత్‌ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్‌కాల్.. వివరాలు ఆరా!

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం, తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర ఆలయంతోపాటు ఏడుపాయల, కీసర, కాళేశ్వరం, కొమురవెల్లి తదితర ఆలయాలకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. అత్యధికంగా ఏపీలోని శ్రీశైలం ఆలయానికి 800 బస్సులు ఏర్పాటుచేయగా.. వేములవాడ క్షేత్రానికి 714 బస్సులు, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, వేలాల ఆలయానికి 171, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 బ‌స్సులను ఏర్పాటుచేశారు.

Also Read: Koneru Konappa: దిగివచ్చిన రేవంత్‌ రెడ్డి.. బుజ్జగింపులతో కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ చేరిన కోనేరు కోనప్ప

మిగతా క్షేత్రాలకు..
ఆలంపూర్, ఉమామ‌హేశ్వ‌రం, పాల‌కుర్తి, రామ‌ప్ప‌ త‌దిత‌ర ఆల‌యాల‌కు కూడా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. శైవ క్షేత్రాల సందర్శనకు ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, సీబీఎస్, ఐఎస్‌ సదన్‌, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్‌ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. 

Also Read: Bird Flu Case: తెలంగాణలో హై అలర్ట్‌.. తొలి బర్డ్‌ ఫ్లూ కేసు నమోదు

టికెట్‌ ధరల పెంపు?
మహా శివరాత్రికి ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సుల్లో ఆర్టీసీ భారీగా ఛార్జీలు పెంచింది. టికెట్ ధరలను ఆర్టీసీ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తూ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేకపోగా.. ఈ నెల 24 నుంచి 27 తేదీ వరకు (నాలుగు రోజులు) నడిచే ప్రత్యేక బస్సుల్లో సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయల బస్సుల్లో మూడు రోజులు కొత్త ఛార్జీలు అమల్లో ఉంటాయి.

ఉచిత బస్సు?
మహాశివరాత్రి  సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం ఉందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో  మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుంది. మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని ఆర్టీసీ సూచించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News