కేసీఆర్ నోట మళ్లీ జాతీయ రాజకీయాల మాట; నాన్ కాంగ్రెస్-నాన్ బీజేపీ ఫ్రంట్ ఏర్పాటు

  

Last Updated : Nov 21, 2018, 03:46 PM IST
కేసీఆర్ నోట మళ్లీ జాతీయ రాజకీయాల మాట;  నాన్ కాంగ్రెస్-నాన్ బీజేపీ ఫ్రంట్ ఏర్పాటు

నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ జాతీయ రాజకీయాలపై స్పందించారు. దేశంలో నాన్ బీజేపీ -నాన్ కాంగ్రెస్  ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. కేంద్రం పెత్తనాన్ని పూర్తిగా నియంత్రించి కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం ఉండేలా ఫ్రంట్ ఉండాలని అభిప్రాయపడ్డారు. నల్గొండ జిలా దేవరకొండలో ఈ రోజు టీఆర్ఎస్ ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న కేసీఆర్ పదునైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై స్పందిస్తూ దేవరకొండ కరువుతో నలిగిపోయిన ప్రాంతం..ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో కృషి చేశామని భవిష్యత్తులో మరిన్ని పథకాల రూపకల్పన చేస్తామన్నారు. 

కేసీఆర్ నోట మళ్లీ రిజర్వేషన్ల మాట
దేవరకొండ సభలో సీఎం కేసీఆర్ రిజ్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు అవసరమని..అది కేంద్రం పరిధిలో ఉన్నందున అమలు చేయలేకపోయమన్నారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించినట్లే..ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లు సాధిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. 

చంద్రబాబు అవసరమా ?
ఈ సందర్భంగా చంద్రబాబు గురించి ప్రస్తావిస్తూ తెలంగాణకు ద్రోహం చేసిన ఆ వ్యక్తి మనకు మళ్లీ అవసరమా ? అనిప్రశ్నించారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ అంధకారరమౌతుందని..జనాలు అన్ని ఆలోచించుకొని ఓటు వేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో మాయ మాటలు చెప్పే కాంగ్రెస్,మహాకూటమి నేతలకు చెంప చెళ్లమనేలా సమాధానం ఇవ్వాలని ప్రజలకు కేసీఆర్ పిలపునిచ్చారు

 

Trending News