ఇంటర్ ఫలితాల అవకతవకలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ స్పందిస్తూ ..ఈ వ్యవహారంలో ఎలాంటి అక్రమాలు జరగాలేదని పెద్దమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేయ్ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్..కాంగ్రెస్ బఫున్ ఒకడు ‘నువ్వు పెద్దమ్మ గుడికి రా.. ప్రమాణం చేయ్.. లేదంటే నేను చెప్పిందే కరెక్ట్’ అంటడు. ఇదెక్కడి లాజిక్. ఆయన చెప్పిన టైమ్ కు వెళ్లి నేను పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేయాలంట. ఇదెక్కడి చిల్లర రాజకీయం? అంటూ ఎద్దేవ చేశారు.
గ్లోబరీనా సంస్థపై కేటీఆర్ వివరణ
ఇంటర్ మూల్యాకనం కోసం గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టును తానే ఇప్పించాననీ, ఇందులో రూ.10,000 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోసిస్తున్నారు..నిజానికి ఇది రూ.4.30 కోట్ల టెండర్ అని వ్యాఖ్యానించారు. మూడేళ్ల కాలానికి సంబంధించి ఈ ఒప్పందాన్ని ఇంటర్ బోర్డు, విద్యాశాఖలు గ్లోబరీనాతో చేసుకున్నాయని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లకు ఇంకేం పని ఉండదు... 24 గంటలు అబద్ధపు రీళ్లు తిప్పడమే వాళ్ల పని. ఇంటర్ ఫలితాల విషయంలో కాంగ్రెస్ వారు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడం మానుకోవాలని కేటీఆర్ దయ్యబట్టారు
వీహెచ్ ఎమన్నారంటే..
విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ. హన్మంతరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఇదే సందర్భంలో గ్లోబరీనా సంస్థ గురించి తనకు తెలీదన్న ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పెద్దమ్మ గుడిలో ప్రమాణం చెయ్యాలని ఒకవేళ చెయ్యకుంటే కేటీఆర్ తప్పు చేసినట్టేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పెద్దమ్మ గుడికి రావాలని ...అక్కడ అమ్మవారి మీద ప్రమాణం చెయ్యాలని సవాల్ విసిరిన వీహెచ్ పెద్దమ్మ గుడిలో కేటీఆర్ కోసం వెయిట్ చేశారు . ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు