Padi Kaushik Reddy Arrest: తెలంగాణలో పండుగ నాడు కూడా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మాజీ మంత్రి కేటీఆర్ బంధువులకు సంబంధించిన హోటల్‌పై దాడులు చేయడంతోపాటు బీఆర్‌ఎస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. భోగి రోజు సాయంత్రం నుంచి తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయి. పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత పార్టీ నాయకులను నిర్బంధించారు. తెల్లారి మంగళవారం సంక్రాంతి రోజు కూడా అరెస్ట్‌ల పర్వం కొనసాగింది. ఒక్క నాయకుడిని కూడా బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ఇక నుంచి ఆ కష్టాలకు చెక్
గచ్చిబౌలిలో కేటీఆర్
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేటీఆర్‌ను బయటకు రాకుండా నిర్బంధం చేశారు.
కోకాపేటలో హరీశ్ రావు
హైదరాబాద్ శివారు కోకాపేటలోని హరీశ్ రావు నివాసం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హరీశ్ రావును గృహ నిర్బంధం చేయగా.. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
కరీంనగర్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్‌లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి కరీంనగర్‌కు తరలించారు. కౌశిక్ అరెస్ట్‌తో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. కరీంనగర్‌లో ఎక్కడికక్కడ పోలీసులు మొహరించారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కౌశిక్ రెడ్డి అనుచరులు, అభిమానులు ఆందోళన చేస్తారనే సమాచారంతో పోలీస్ బలగాలు పట్టణాన్ని అష్ట దిగ్బంధనం చేశారు. కరీంనగర్‌కు వెళ్లే అన్ని రహదారుల్లో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు. కౌశిక్ కోసం వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్యను కొదురుపాక వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు సంచలనం.. తెలంగాణలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్
భయపడం: కౌశిక్ రెడ్డి
అరెస్ట్ చేసి వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరపర్చేందుకు తీసుకెళ్తున్న సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీస్ వాహనంలో నుంచి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఎన్ని కేసులు పెట్టిన అరెస్టులకు భయపడం. రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారు' అని పేర్కొన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ సెకండ్ అడిషనల్ జ్యూడీషియల్ జడ్జ్ ప్రేమలత ముందు పోలీసులు హాజరుపర్చారు.
ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేదే లేదు.. ప్రజల కోసం నిలబడతం.
- న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టే సమయంలో మీడియాతో మాట్లాడిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి pic.twitter.com/7PyFpkpx23
— Mission Telangana (@MissionTG) January 14, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.