Southwest Monsoon: దేశంలో నైరుతి రుతుపవనాలు వేగాన్ని అందుకున్నాయి. క్రమ క్రమంగా అన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. తాజాగా తెలంగాణకు నైరుతి రాగం తాకింది. ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తరిస్తున్నాయి. రాగల 48 గంటల్లో తెలంగాణలోకి మరికొన్ని ప్రాంతాల్లోకి..మరో రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి.
రుతు పవనాల రాకతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని అంచనా వేస్తున్నారు. రేపు, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. మూడురోజులపాటు తెలంగాణవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పులను ప్రజలు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఇవాళ అరేబియా సముద్రంలోని మరి కొన్ని ప్రాంతాలు, గుజరాత్‌లోని కొన్ని చోట్ల, కొంకణ్, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో రుతు పవనాలు విస్తరించాయి. మరాఠ్వాడా, కర్ణాటకలో చాలా ప్రాంతాలు, తెలంగాణ, రాయలసీమలోని పలు ప్రాంతాలు, ఉప-హిమాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని కొన్నిచోట్ల రుతు పవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
Also read:IND vs SA 2nd T20: ఆ ఒక్కడు తప్పితే.. టీమిండియాలో మరో వికెట్ టేకింగ్ బౌలర్ లేడు: గవాస్కర్
Also read:CM Jagan Tour: ఏపీలో రైతులకు శుభవార్త..రేపే ఖరీఫ్ పంటల బీమా పరిహారం అందజేత..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.