Speaker Pocharam Srinivas Reddy tested Corona Positive : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాల కనిపించడంతో..కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు పోచారం ((Pocharam Srinivas reddy). వైద్య పరీక్షల్లో ఆయన పాజిటివ్ (Covid-19 Positive)గా తేలింది. దీంతో ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరి..చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. గతంలో కూడా ఆయన కొవిడ్ బారిన పడ్డారు. ఇటీవల టీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి (TRS Medak MLA Padma Devender Reddy) కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
తెలంగాణలో నిన్న 1,963 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 4,054కు చేరినట్లు (Corona deaths in Telangana) ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో కొవిడ్ మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. నిన్న 1,620 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.31 శాతానికి తగ్గింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 22,017 యాక్టివ్ కొవిడ్ (Acitve Corona Cases in Telangana) కేసులు ఉన్నాయి.
Also Read: TRS MLA Covid positive : టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్తగా మరో 2,71,202 మందికి వైరస్ (Corona cases in India) సోకింది. వైరస్‌తో 314 మంది మరణించారు. 1,38,331 మంది కొవిడ్‌ను జయించారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7,743కి (Omicron Cases in India) చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా టీకా డోసుల పంపిణీ 1,56,76,15,454కు చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook