Teen stabs man in Jagadgirigutta : తల్లితో వివాహేతర సంబంధం, యువకుడిని పొడిచిన కొడుకు

Teen stabs man in Jagadgirigutta : తన తల్లితో వివాహేతర సంబంధం ఉందని యువకుడిని కత్తితో పొడిచిన కొడుకు. జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 08:20 PM IST
  • తన తల్లితో వివాహేతర సంబంధం ఉందని యువకుడిని కత్తితో పొడిచిన కొడుకు
  • జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన
Teen stabs man in Jagadgirigutta : తల్లితో వివాహేతర సంబంధం, యువకుడిని పొడిచిన కొడుకు

Teen stabs man for illegal affair with mom in Jagadgirigutta Hydearbad : వివాహేతర సంబంధం వల్ల ఒక వ్యక్తి తాజాగా కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు (Police) తెలిపిన వివరాల మేరకు, జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రిక్షాపుల్లర్స్‌ కాలనీలో అనిల్‌ కుమార్‌ (28) (Anil Kumar) నివాసం ఉంటున్నారు. గతంలో జీహెచ్‌ఎంసీ (GHMC) గాజులరామారం సర్కిల్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేసేవాడు అనిల్. రెండేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీలో ఉద్యోగం మానేశాడు. ప్రస్తుతం ప్రైవేట్‌గా పనులు చేస్తున్నాడు.

అయితే గతంలో పని చేసే చోట ఒక మహిళా కార్మికురాలితో (female worker) అనిల్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమెతో అనిల్‌ (Anil) తరుచూ ఫోన్‌లో మాట్లాడేవాడు.

ఇది గమనించిన ఆ మహిళా కార్మికురాలి కొడుకు శ్రీరామ్‌ (19) (Sriram) ఈ విషయంపై తల్లిని నిలదీశాడు. తల్లితో అనిల్‌కు వివాహేతర సంబంధం ఉందని, అతన్ని అంతమొందించాలని ప్లాన్ వేశాడు శ్రీరామ్.

ఈ క్రమంలో మాట్లాడుదాం రండి అంటూ అనిల్‌ను.. శ్రీరామ్‌ జగద్గిరిగుట్టలోని ఒక ఫంక్షన్‌ హాలు (Jagadgirigutta Function Hall) వద్దకు పిలిపించాడు. అనిల్ అక్కడికి రాగానే శ్రీరామ్.. కర్రలతో కొట్టాడు, కత్తితో పొట్టలో పొడిచాడు శ్రీరామ్.

Also Read : India Corona cases: దేశంలో కొవిడ్ కల్లోలం- ఈ నగరాల్లో అధిక తీవ్రత

అనిల్ దాడి నుంచి తప్పించుకుని స్థానికుల సాయంతో కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో (Private Hospital) చేరాడు. సమాచారం తెలుసుకున్న జగద్గిరిగుట్ట (Jagadgirigutta) పోలీసులు.. (Police) శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన తల్లితో అక్రమ సంబంధం (Illegal relationship) ఉందనే అనుమానంతోనే అనిల్‌పై దాడి చేసినట్లు శ్రీరామ్ అంగీకరించాడు. 

Also Read : Rashmika Mandanna: భారీగా పెంచేసిన రష్మిక మందన్న.. వామ్మో మరీ అంతనా?!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News