Governer Tamilsai: కేసీఆర్ పై పోరాటంలో తగ్గేదే లే.. బాసర ట్రిపుల్ ఐటీకి గవర్నర్ తమిళి సై..

Governer Tamilsai:  తెలంగాణ గవర్నర్ తమిళి సై, కేసీఆర్ సర్కార్ మధ్య కొన్ని రోజులుగా వార్ సాగుతోంది. కేసీఆర్ ప్రభుత్వం తనను అవమానిస్తోందని ఆరోపిస్తున్న గవర్నర్ తనదైన శైలిలో దూకుడుగా వెళుతున్నారు. వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. జిల్లాలు చుట్టేస్తున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళుతున్నారు.

Written by - Srisailam | Last Updated : Aug 6, 2022, 02:49 PM IST
  • రేపు బాసర ట్రిపుల్ ఐటీకి గవర్నర్
  • విద్యార్థులతో మాట్లాడనున్న తమిళి సై
  • కేసీఆర్ సర్కార్ పై గవర్నర్ వార్
Governer Tamilsai: కేసీఆర్ పై పోరాటంలో తగ్గేదే లే.. బాసర ట్రిపుల్ ఐటీకి గవర్నర్ తమిళి సై..

Governer Tamilsai: తెలంగాణ గవర్నర్ తమిళి సై, కేసీఆర్ సర్కార్ మధ్య కొన్ని రోజులుగా వార్ సాగుతోంది. కేసీఆర్ ప్రభుత్వం తనను అవమానిస్తోందని ఆరోపిస్తున్న గవర్నర్ తనదైన శైలిలో దూకుడుగా వెళుతున్నారు. వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. జిల్లాలు చుట్టేస్తున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళుతున్నారు. జిల్లాల పర్యటనకు సందర్భంగా ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు అవమానిస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు గవర్నర్ తమిళి సై. తాజాగా ఆమె నిర్మల్ జిల్లా బాసరకు వెళుతున్నారు. కొన్ని రోజులుగా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకుతోంది బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్. దీంతో బాసరకు వెళుతున్న గవర్నర్.. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు.

శనివారం రాత్రి రైలులో బాసరకు వెళ్లనున్నారు గవర్నర్ తమిళి సై.  ఆదివారం ఉదయం 6 గంటలకు సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటారు. ఉదయం 7 గంటలకు బాసర ట్రిపుల్‌ ఐటీకి వెళ్లనున్నారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేయనున్నారు. ఉదయం 8 గంటలనుంచి 10 గంటలవరకు విద్యార్థులు, ఉద్యోగులతో మాట్లాడనున్నారు. మూడు రోజుల క్రితమే బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ తమిళి సైని కలిశారు. క్యాంపస్ లో నెలకొన్న  సమస్యలను గవర్నర్ దృష్టికి విద్యార్థులు తీసుకెళ్లారు. విద్యార్థులు తనను కలిసివెళ్లిన కొన్ని రోజుల్లోనే గవర్నర్ తమిళి సై క్యాంపస్ కు వెళుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

గత నెల రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.  మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత, నాణ్యత లేని వంటి పలు  సమస్యలపై విద్యార్థులు నిరసనకు దిగారు, బాసర స్టూడెంట్స్ నిరసనలకు కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. బాసర విద్యార్థుల ఆందోళనతో విద్యాశాఖ మంత్రి స్పందించారు. క్యాంపస్ కు వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా మంత్రి ఇచ్చిన హామీలు అమలు కాలేదు. మంత్రి క్యాంపస్ కు వచ్చివెళ్లిన కొన్ని రోజులపై ఫుడ్ పాయిజన్ జరిగింది. పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని డిమాండ్ చేస్తూ ఇంజనీరింగ్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు మూడు పూటలు భోజనం బహిష్కరించారు.జాగారం చేసిన నిరసన వ్యక్తం చేశారు.గతంలో మంత్రి ఇచ్చినహామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇన్‌చార్జి వైస్ ఛాన్సలర్ వీ వెంకట రమణ ఛాంబర్ ముందు భైఠాయించారు.

ఇటీవలే యూనివర్శిటీల విద్యార్థులతో రాజ్ భవన్ లో గవర్నర్ సమావేశం కావడం చర్చనీయాంశం కాగా.. తాజా యూనివర్శీటీల సందర్శనకు తమిళి సై వెళుతుండటం ప్రభుత్వంలో కాక రేపుతోంది. కేసీఆర్ పై పోరాటంలో తగ్గేదే లే అంటున్నట్లుగా గవర్నర్ తమిళి సై ముందుకు వెళుతున్నారని అంటున్నారు. ఇప్పటికే కేంద్రం, కేసీఆర్ సర్కార్ మధ్య తీవ్ర స్థాయిలో వార్ సాగుతోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో గవర్నర్ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

Read also: Kesineni Nani:చంద్రబాబుకు ఇవ్వాల్సిన బొకేను విసిరిగొట్టిన కేశినేని నాని.. టీడీపీలో కలకలం

Read also: Jagan Delhi Tour: ప్రధాని మోడీ సమావేశానికి సీఎం జగన్ డుమ్మా.. చంద్రబాబే కారణమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News