తలసాని సాయం..!!

'కరోనా వైరస్' దెబ్బకు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి అవకాశాలు లేక ఆర్ధికంగా చితికిపోయారు. తెలుగు సినీ, టీవీ పరిశ్రమలోనూ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఐతే వారిని ఆదుకునేందుకు మేమున్నామంటూ ముందుకొచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తమ తలసాని ట్రస్ట్ ద్వారా 14 వేల మంది సినీ, టీవీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Last Updated : May 28, 2020, 03:12 PM IST
తలసాని సాయం..!!

'కరోనా వైరస్' దెబ్బకు దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఉపాధి అవకాశాలు లేక ఆర్ధికంగా చితికిపోయారు. తెలుగు సినీ, టీవీ పరిశ్రమలోనూ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఐతే వారిని ఆదుకునేందుకు మేమున్నామంటూ ముందుకొచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తమ తలసాని ట్రస్ట్ ద్వారా 14 వేల మంది సినీ, టీవీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సినీ, టీవీ కార్మికులను ఆదుకునేందుకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తనవంతు సాయంగా 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్ ద్వారా నిత్యావ‌స‌రాల సరుకులను పంపిణీ చేశారు. గురువారం అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, కొరటాల శివ ,రాధాకృష్ణ, రామ్ మోహనరావు , తలసాని సాయి, ఎన్.శంకర్, సి.కళ్యాణ్, అభిషేక్, కాదంబరి కిరణ్ తదితరుల సమక్షంలో కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. 14 వేల మంది కార్మికుల్లో 12 వేల మంది సినీ , 2 వేల మంది టీవి కార్శికుల కు నిత్యావసర సరుకులు తీసుకున్నారు.

 గత 2 నెలలుగా లాక్ డౌన్ అమలులో ఉండటం వలన పేద ప్రజలు, వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం 12 కిలోల బియ్యం, 1500 రూపాయలను అందించిన విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా సినీ, టీవీ కార్మికులకు ఈ విపత్కర పరిస్థితులలో తనవంతు చేయూతగా నిత్యావసర వస్తువులను అందించినట్లు చెప్పారు.

అడగగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు, దర్శకులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News