Telangana Politics: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఫుల్ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చేసింది. ఇన్నాళ్లు ఫామ్‌హౌస్‌కే పరిమితం అయినా గులాబీ కేసీఆర్.. ఈనెల 19న తెలంగాణ భవన్‌కు రాబోతున్నారు. హైదరాబాద్ వేదికగా బీఆర్‌ఎస్ నేతలకు దిశానిర్ధేశం చేయబోతున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పడి ఫిబ్రవరి 19వ తేదీ నాటికి 25 ఏళ్లు పూర్తవుతుంది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించే అంశంపైన చర్చిస్తారట. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. కొత్త సర్కార్‌కు ఓ ఏడాది సమయం ఇవ్వాలని కొద్దిరోజులుగా పార్టీ నేతలకు కేసీఆర్ చెబుతూ వస్తున్నారు. అయితే ఇచ్చిన డెడ్‌లైన్ పూర్తి కావడంతో కేసీఆరే రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఏడాది కాలంగా కాంగ్రెస్ పాలనపై చర్చిస్తారని సమాచారం. అయితే చాలా రోజుల తర్వాత కేసీఆర్ తొలిసారి తెలంగాణ భవన్‌కు వస్తున్న కేసీఆర్.. ఆ తర్వాత కూడా కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్టు సమాచారం.
మరోవైపు తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరంతా పార్టీ ఫిరాయించడంతో బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈకేసు తీర్పు నేడు (మంగళవారం) వస్తుందని అనుకుంటోంది. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే.. ఉప ఎన్నికల వేడిని మరింత రాజేయాలని గులాబీ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఈ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే.. అన్ని సీట్లను గెలిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారట. అయితే ఇన్నాళ్లు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని పార్టీ నేతలు నిరుత్సాహ పడుతున్నారు. ఇటీవల ఫామ్‌హౌస్‌లో ఆయన్ను కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని పలువురు నేతలు లెవనెత్తారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఉప ఎన్నికలను ప్రస్తావించారు. తాను త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు రెడీ అయినట్టు వారితో చెప్పారట.
ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. త్వరలోనే రేవంత్‌పై తిరుగుబాటు తప్పదని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు చూస్తున్నారని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ తరహాలో తెలంగాణ పింక్ బుక్ ప్రస్తావన తెచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసుల పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ నేతల అక్రమ కేసులపూ పింక్ బుక్‌లో అన్ని రాసుకుంటున్నామనీ.. తాము అధికారంలోకి వచ్చాకా లెక్కలు తీస్తామని హెచ్చరించారు. కవిత వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఇలా వరుసగా నేతలంతా హాట్‌కామెంట్స్ చేయడంతో బీఆర్ఎస్ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చినట్టయ్యింది..
మొత్తంమీద గులాబీ బాస్ రంగంలోకి దిగుతుండటంతో పార్టీ శ్రేణులు ఖుషీ అవుతున్నారు. అంతేకాదు త్వరలోనే జరిగే రెండు బహిరంగ సభలతో పార్టీకి పూర్వ వైభవం ఖాయమని భావిస్తున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు.. గులాబీ బాస్ జనంలోకి వస్తుండటంతో.. అటు కాంగ్రెస్ పార్టీకూడా అలర్ట్ అయ్యినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ను ఎదుర్కొనే విషయంలో ప్రతివ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.
Also Read: Viral Video: వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో.. రెప్పపాటులో ఘోర ప్రమాదం నుంచి బైటపడ్డ బుడ్డొడు..
Also Read: One Nation One Gold Rate: గోల్డ్ రేట్స్ ను కంట్రోల్ చేసేందుకు మాస్టర్ ప్లాన్..అదేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter