Harish Rao: ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు తిరగబడుతున్నారని.. గ్రామసభలు పోలీసుల బందోబస్తులో నిర్వహించడం ఏమిటని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభల్లో ప్రజల తిరుగుబాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపిస్తుందని ప్రకటించారు.