Double Bonus: ఉద్యోగులకు భారీ గిఫ్ట్.. లాభాలను 'డబుల్‌ బోనస్‌'గా పంచేసిన కంపెనీ

Hermes Shares Rs 4 lakh Bonus To All Employees: పని చేసే ఉద్యోగులకు కనీవినీ రీతిలో కంపెనీ భారీ బోనస్‌ అందించింది. ఉద్యోగులకు రూ.4 లక్షల చొప్పున బోనస్‌ ప్రకటించింది. ఈ వార్తతో ఉద్యోగులు, వారి కుటుంబీకులు ఆనందంలో మునిగాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 17, 2025, 10:27 PM IST
Double Bonus: ఉద్యోగులకు భారీ గిఫ్ట్.. లాభాలను 'డబుల్‌ బోనస్‌'గా పంచేసిన కంపెనీ

Employees Bonus: ఉద్యోగులు, కంపెనీల మధ్య అనుబంధం జీతం అనే దానితో ముడిపడి ఉంటుంది. జీతం ఇస్తుండడంతో మేం పని చేస్తున్నామనే భావన ఉద్యోగుల్లో.. మేం జీతం ఇస్తుండడంతో ఉద్యోగులు పనిచేస్తున్నారనే భావన కంపెనీలో ఉంటే కంపెనీతోపాటు ఉద్యోగుల జీవితాల్లో కూడా కొత్తదనం ఉండదు. అంతకుమించి అనుబంధం ఉంటే కంపెనీ లాభాల్లో పయనించడమే కాకుండా ఉద్యోగుల కుటుంబాలు ఆనందంలో ఉంటాయి. అలాంటి అనుబంధం కొనసాగిస్తున్న ఓ కంపెనీ ఉద్యోగులకు కనీవినీ ఎరుగని రీతిలో ఆనందంలో ముంచెత్తింది. వారికి ఏకంగా రూ.4 లక్షల బోనస్‌ ప్రకటించి ఉద్యోగులను భారీ కానుక అందించింది. ఏ కంపెనీ? ఎక్కడ? అనే వివరాలు తెలుసుకుందాం.

Also Read: Pending DAs: 'ప్రభుత్వ ఉద్యోగులకు 4 డీఏలు‌, 2వ పీఆర్‌సీ ఎప్పుడు?'

పారిస్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌ హర్మెస్‌ వచ్చిన లాభాలను ఉద్యోగులకు పంచేసింది. లాభాలు రావడమే కాకుండా వ్యాపారంలో కంపెనీ భారీ ఎదుగుదల సాధించింది. దీంతో ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించింది. తమ సంస్థలో పని చేసే ఒక్కో ఉద్యోగికి రూ.4 లక్షలు (రూ.4,500 యూరోలు) బోనస్‌ ఇచ్చేసింది. ఫ్రెంచ్‌ దేశంలో హర్మెస్‌ కంపెనీ ఫ్యాషన్‌ రంగంలో అతిపెద్ద సంస్థగా కొనసాగుతోంది. 2024లో ఈ కంపెనీ ఆదాయం 15.2 బిలియన్‌ యూరోలు పొందింది. 2023తో పోలిస్ఏ 15 శాతం లాభాలను గడించింది. దీర్ఘకాలిక లక్ష్యాలను వేసుకుని ముందుకు వెళ్తున్న ఈ సంస్థ భారీగా లాభాలు పొందడంతో ఉద్యోగులకు పంచడానికి సిద్ధమైంది.

Also Read: Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్‌ కార్డులు

కంపెనీ క్రమంగా నమ్మకమైన వినియోగదారులను పెంచుకుంటూ వెళ్తున్న హర్మెస్‌ ఇతర దేశాల్లోనూ తన బ్రాండ్‌ను విస్తరిస్తోంది. వ్యాపారం లాభదాయకంగా మారడమే కాకుండా వినియోగదారులు హర్మెస్‌ ఉత్పత్తులతో పూర్తిగా సంతృప్తి చెందుతున్నారు. హర్మెస్‌ గ్రూపు 2024 సంవత్సరంలో 1,300 మందిని నియమించుకోగా మొత్తం ఉద్యోగులు 25,000 మందికి పెరిగింది. ఫ్యాషన్‌ యునైటెడ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం రూ.4 లక్షల చొప్పున ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించింది. ఈ ఏడాదిలో 7 శాతం ఆదాయం వృద్ధి సాధించడంతో ఆ లాభాలను తన ఉద్యోగులకు పంచేసింది. చికాగో, జపాన్‌, ఫ్రాన్స్‌, బీజింగ్‌, షెన్‌జెన్‌తో సహా ప్రపంచ దేశాల్లోని అనేక నగరాల్లో స్టోర్లను ప్రారంభించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News