డ్రంక్ అండ్ డ్రైవ్​ సమస్యకు సాంకేతిక పరిష్కారం.. ఇక ప్రమాదాలకు చెక్!

US Cars Mandated To Identify Drunk Drives: డ్రంక్​​ అండ్ డ్రైవ్​ ప్రమాదాలను తగ్గించేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కార్లలోనే.. డ్రైవింగ్ చేసే వ్యక్తిలో ఆల్కహాల్ శాతాన్ని గుర్తించే సాంకేతికత ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 10:52 AM IST
  • డ్రంక్ అండ్ డ్రైవ్​ ప్రమాదాల నివారణకు అమెరికా కొత్త నిర్ణయం
  • అధునాత టెక్నాలజీతో ప్రమాదాలను అరికట్టేందుకు ప్రయత్నాలు
  • అమెరికా తర్వాత ఇతర దేశాలు పాటించే అవకాశం!
డ్రంక్ అండ్ డ్రైవ్​ సమస్యకు సాంకేతిక పరిష్కారం.. ఇక ప్రమాదాలకు చెక్!

US safety mandate to fight drunk driving: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సమస్యగా మారిన వాటిలో రోడ్డు ప్రమాదాలు కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల (Road accidents) కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంతకన్నా ఎక్కువ మంది అంగవైకల్యానికి గురవుతున్నారు.

రోడ్డు ప్రమాదాలకు డ్రంక్​ అండ్ డ్రైవ్​ ప్రధాన కారణాల్లో ఒకటిగా చాలా సర్వేల్లో తేలింది. డ్రంక్​ అండ్ డ్రైవ్​ను కట్టడి చేసేందుకు (Drunk and Drive) పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రమాదాలు మాత్రం తగ్గటం లేదు.

అయితే ఇప్పుడు అలాంటి ప్రమాదాలను నివారించేందుకు సరికొత్త శాస్త్రీయ పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయంలో అమెరికా ముందు వరుసలో ఉంది.

అమెరికాలో కార్ల వినియోగం అధికంగా ఉంటుంది. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ వల్ల ప్రమాదాలు జరగకుండా.. కార్లలోనే ఆల్కహాల్​ టెస్టింగ్ టెక్నాలజీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

ఏమిటి ఈ టెక్నాలజీ? ఎలా పని చేస్తుంది?

Also read: ప్రముఖ ర్యాపర్ ను కాల్చి చంపిన దుండగుడు, అమెరికాలో ఘటన

Also read: భూమికి పొంచి ఉన్న ముప్పు, ఆ ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టనుందా

డ్రంక్ అండ్ డ్రైవ్​ పరీక్షలు నిర్వహించే సమయంలో పోలీసులు బ్రీత్ అనలైజర్ మిషన్​ను వినియోగిస్తుంటారు. అచ్చం అలానే పని చేసే పరికరాన్ని కారులో ఇన్​బిల్ట్​గా పొందుపరచున్నారు. కారు నడిపే వ్యక్తి ముందుగా బ్రిత్ అనలైజర్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మొతాదుకు మించి మద్యం సేవించినట్లు ఆ మిషన్ గుర్తిస్తే.. ఆ కారు స్టార్ అవదు.

ప్రతికారులలో ఈ టెస్టింగ్ మిషన్​ ఏర్పాటును తప్పనిసరి చేసే విధంగా ఓ రూల్​ను తీసుకురానున్నారట. ఈ టెక్నాలజీ ఉంటే.. మోతాదుకు మించి మద్యం సేవించినవారు కారు నడిపేందుకు వీలుండదు. దీనితో ప్రమాదాలకు చెక్​ పెట్టొచ్చని అమెరికా భావిస్తోంది. అమెరికా ఇటీవలే ఈ రూల్స్​కు అమెరికా ప్రభుత్వం అమోదం తెలిపగా.. అమలులోకి వచ్చేందుకు మాత్రం కాస్త సమయం పట్టనుంది.

అమెరికాలో ఈ విధానం విజయవంతమైతే.. రానున్న రోజుల్లో ఇది ఇతర దేశాలకు విస్తరించే అవకాశముంది.

అత్యాధునిక  టెక్నాలజీతో కూడిన టెక్నాలజీతో ఈ వ్యవస్థ పని చేయనుది. డ్రైవర్​ శ్వాసను సంగ్రహించేలా ఈ ఓ విధమైన సెన్సార్​లను ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థ డ్రైవర్​ శ్వాసతోపాటు, చేతి వేళ్ల ద్వారా రక్తంలోన అల్కహాల్​ శాతాన్ని లెక్కించగలుగుతుంది.

Also read: కోవిడ్ ట్యాబ్లెట్స్‌పై ఫైజర్ కీలక నిర్ణయం, ఇతర కంపెనీలకు అనుమతులు

Also read: ఐరాసలో పాకిస్తాన్ చెంప చెళ్లుమనిపించిన భారత ప్రతినిధి డాక్టర్ కాజల్ భట్ .. వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News