Andhra Pradesh big tree of branch fell on lady devotee near japali hanuman temple: కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల వెంకటేశ్వరుడిని ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు దర్శించుకుంటారు. ఎక్కడి నుంచో వచ్చి.. గంటల కొద్ది క్యూలైన్లలో ఉండి, ఒక్కసారి స్వామి దర్శనమైతే చాలని భావిస్తుంటారు. స్వామి దర్శనం కోసం పరితపిస్తుంటారు. ఇటీవల తిరుమలలో జంతువుల సంచారం ఎక్కువైందని కూడా చెప్పుకొవచ్చు. ముఖ్యంగా నడక మార్గం గుండా వెళ్తున్న వారిపై చిరుతపులి దాడులు చేసిన సంఘటనలు కొకొల్లలు. అంతేకాకుండా.. పాముల సంచారం కూడా ఇటీవల ఎక్కువయ్యింది.
తిరుమలలో యువతిపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. యువతికి తీవ్ర గాయాలు
తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది.
తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. pic.twitter.com/I1WzTdJjfb
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2024
చిరుతపులులు, ఎలుగు బంట్లు రాత్రిపూట నడక మార్గంలో ఎక్కువగా సంచరిస్తున్నాయి. చిరుతలతే ఏకంగా రోడ్లమీదకు కూడా వచ్చేస్తున్నాయి. దీంతో భక్తులు ఇటీవల తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. అయిన కూడా ఆ స్వామి తమకు ఎలాంటి అపాయం లేకుండా కాపాడతారని ఆ భక్తులు కేవలం వెంకటేశ్వర స్వామిపై నమ్మకంతో దర్శనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తిరుమల స్వామివారిని దర్శించుకొవడానికి వచ్చిన యువతికి అనుకొని ఘటన ఎదురైంది.
పూర్తి వివరాలు..
తిరుమలలో ఒక భక్తురాలికి ఊహించని ఘటన ఎదురైంది. రెప్పపాటులో ఆమెకు పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఆమెకు నడుముకు తీవ్ర గాయలైనట్లు తెలుస్తొంది. ఒక యువతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చింది. లైన్ లో స్వామివారిని దర్శించుకుంది. ఆతర్వాత జాపాలీ ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్లింది. అక్కడి పచ్చని నేచర్ అందాలను చూస్తుంది. జాపాలీ వద్ద హనుమంతుడు గుప్తరూపంలో ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. అక్కడ వచ్చిన వారి ఎలాంటి ఆపదలు, బాధలు అయిన కూడా పోతాయని చెప్తుంటారు.
ఈ నేపథ్యంలో సదరు యువతి అక్కడ నిలబడి స్వామివారిని మనస్సులు ధ్యానం చేసుకుంటుంది. అప్పడు ఒక్కసారిగా చెట్టుపైన నుంచి భారీ కొమ్మ విరిగి, బలంగా వచ్చి, ఆమె తలమీద పడింది. ఆ కుదుపుకు ఆమె ఒక్కసారిగా కిందకు పడిపోయింది. చుట్టుపక్కల ఉన్న వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే అక్కడున్న వారు తెరుకుని,అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు.
సదరు యువతిని వెంటనే టీటీడీ వారి ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.కాగా, ఆమె వెన్నుపూసకు మాత్రం బలంగా గాయమైనట్లు తెలుస్తోంది. ఆమెపై చెట్టుకొమ్మ పడిన ఘటన మాత్రం సీసీటీవీ లో రికార్డు అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు ఆమెను తిరుమల వెంకన్న , జాపాలీ అంజన్న కాపాడారని కామెంట్లు చేస్తున్నారు. ఆమె వెంటనే కొలుకోవాలని కూడా ప్రార్థిస్తున్నారు. ఈ ఘటన మాత్రం కలకలంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి