Krishna water Dispute: కృష్ణా నదీ జలాల వివాదం ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఘర్షణపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం.
కృష్ణా నదీ జలాల వివాదం(Krishna Water Dispute)పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. ముఖ్యంగా శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి విషయంలో తలెత్తిన వివాదం పెరిగి పెద్దదైంది. తెలంగాణ వైఖరికి వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులకు లేఖ రాశారు. కేంద్రం నుంచి సమాధానం రాకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఈ వివాదాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకు దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటీషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)కు ఆశ్రయించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం జూన్ 28వ తేదీన ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరింది. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని..తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోందని పిటీషన్‌లో పేర్కొంది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును, విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఏపీ ప్రభుత్వం(Ap government) తెలిపింది.
Also read: Anandaiah Medicine: అందుకు తాను బాధ్యుడిని కాదని స్పష్టం చేసిన కృష్ణపట్నం ఆనందయ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook