Pawan kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఫిక్స్.. అక్కడి నుంచే ప్రారంభం

Janasena Varahi Yatra Will Starts From Annavaram: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అన్నవరం నుంచి ప్రారంభంకానుంది. జూన్ 14న ఆయన అన్నవరంలో స్వామి వారిని దర్శించుకుని యాత్రను మొదలుపెట్టనున్నారు. ఈ మేరకు వివరాలను నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 2, 2023, 07:49 PM IST
Pawan kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఫిక్స్.. అక్కడి నుంచే ప్రారంభం

Janasena Varahi Yatra Will Starts From Annavaram: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం.. ఓ నూతన అధ్యాయం నిర్మాణం కోసం.. ప్రజా సమస్యలపై బలమైన పోరాటం చేసేందుకు వారాహి యాత్రను పవన్ కళ్యాణ్‌ జూన్‌ 14వ తేదీన నుంచి ప్రారంభించబోతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సకల శుభాలనిచ్చే అన్నవరం సత్యదేవుడి దర్శనం చేసుకుని.. ఆ దేవుని ఆశీస్సులు తీసుకొని వారాహి యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. 

"అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర ఉంటుంది. కేవలం ఎన్నికల కోసం మాత్రమే యాత్ర కాదు. ప్రజల బాధలను దగ్గరగా తెలుసుకునేందుకు, వారితో మమేకం అయ్యేందుకు ఇదో చరిత్రలో నిలిచిపోయే యాత్ర కాబోతోంది. ప్రతి నియోజకవర్గంలో పవన్‌ కళ్యాణ్‌ గారు రెండు రోజులపాటు ఉండేలా ప్రణాళిక తయారు చేసుకున్నాం. 11 నియోజకవర్గాల్లో మొదటిగా యాత్ర జరగబోతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంతో మొదలుపెట్టి, పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్‌, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో యాత్ర రూట్‌ మ్యాప్‌ ను స్థానిక పార్టీ నేతలు చర్చించి ఖరారు చేస్తారు. 

ప్రతి నియోజక వర్గంలో వారాహి నుంచి ప్రజలని ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ గారు ప్రసంగిస్తారు. ప్రజల సమస్యలు వింటూ.. వాటిని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, సమస్యలతో సతమతమవుతున్న బాధితులతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ యాత్ర సాగేలా ప్రణాళిక ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు ప్రజా వినతులు స్వీకరించి.. స్థానికులు,
రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలతో పవన్‌ కళ్యాణ్‌ గారు ప్రత్యేకంగా మాట్లాడుతారు. అనంతరం పార్టీ నాయకులు, వీర మహిళలతో పార్టీ బలోపేతం మీద  దిశానిర్దేశం ఉంటుంది.." అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 

ఆయా నియోజవర్గాల్లోని కార్మిక, రైతువర్గాలు, చేనేత, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, డ్వాక్రా మహిళలు, స్థానికంగా ఉండే అన్ని వర్గాలవారితోనూ పవన్‌
కళ్యాణ్‌ మాట్లాడుతూ ముందుకు వెళతారని చెప్పారు. స్థానికంగా ఉండే సమస్యలను తెలుసుకొని.. పరిశీలించి వాటిపై ప్రసంగిస్తారని తెలిపారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా, పాలకుల కళ్లు తెరిపించేలా, సమస్యకు పరిష్కారం చూపేలా గళమెత్తుతారని అన్నారు. కచ్చితంగా వచ్చే జనసేన ప్రభుత్వంలో సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపుతామో కూడా ప్రజలకు భరోసానిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వారాహి యాత్ర చారిత్రాత్మక యాత్రగా నిలిచిపోనుందన్నారు.

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈసారి డీఏ ఎంత పెరగనుందంటే..?  

పొత్తులలో భాగం కాదు..

పొత్తులలో భాగంగా ఖరారు అయిన యాత్ర కాదిదని స్పష్టం చేశారు నాదెండ్ల మనోహర్. అన్నీ నియోజకవర్గాల్లోనూ వారాహి యాత్ర ఉండాలనేది పవన్‌ కళ్యాణ్‌  అభిమతం అని అన్నారు. ఈ యాత్ర ఎన్నికల కోసమో.. పొత్తులో ఖరారైన నియోజకవర్గాల్లోనో సాగే యాత్ర కాదన్నారు. అన్ని నియోజకవర్గాల్లో సమస్యలను.. ప్రజలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు, కలుసుకునేందుకు చేస్తున్న యాత్ర అని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో జన వాణి కార్యక్రమం ఉంటుందన్నారు. 

Also Read: Telangana Formation Day: ఇదో మైలురాయి.. నా జీవితం ధన్యమైంది: సీఎం కేసీఆర్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News