YSRCP Plenary Live Updates:ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు..వైసీపీకి విజయమ్మ రాజీనామా

YSRCP Plenary 2022: ఏపీలో వైసీపీ ప్లీనరీకి అంతా సిద్ధమైంది. రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ప్లీనరీకి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2022, 01:12 PM IST
YSRCP Plenary Live Updates:ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు..వైసీపీకి విజయమ్మ రాజీనామా
Live Blog

YSRCP Plenary 2022: ఏపీలో నేటి నుంచి రెండు రోజుల పాటు వైసీపీ ప్లీనరీ జరగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని నేటి నుంచి ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న స్థలంలో ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న తొలి ప్లీనరీ కావడంతో అందరి దృష్టి అటువైపే ఉంది. ప్లీనరీ సమావేశాల తొలిరోజు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం, పార్టీ జెండా ఆవిష్కరణ, అధ్యక్ష ఎన్నికల ప్రకటన ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ప్లీనరీ సమావేశాలపై ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ మీకోసం... 

8 July, 2022

  • 13:03 PM

    తల్లిగా జగన్ కు ఎప్పటికి అండగా ఉంటా- విజయమ్మ

    ఇద్దరు వేర్వేరు రాష్ట్రాలకు ప్రతినిధులు- విజయమ్మ

    ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు- విజయమ్మ

     

  • 12:54 PM

    వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా

    వైసీపీ నుంచి నేను తప్పుకుంటున్నా- విజయమ్మ

    షర్మిల ఒంటరి పోరాటం చేస్తోంది.. ఆమెకు అండగా ఉంటా- విజయమ్మ

  • 12:38 PM

    వైఎస్ జగన్ మాస్ లీడర్- విజయమ్మ

    ఎలాంటి వివక్ష లేకుండా అందరికి సంక్షేమ పథకాలు

    పేద బిడ్డల భవిష్యత్ జగన్ చూసుకుంటారు- విజయమ్మ

    జగన్ యువతకు రోల్ మోడల్ - విజయమ్మ

     

  • 12:24 PM

    ఆనాడు అధికారిక శక్తులన్ని జగన్ పై కుట్ర చేశాయి- విజయమ్మ

    అన్యాయం కేసులు పెట్టి వేధించారు- విజయమ్మ

    ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలిచాం- విజయమ్మ

    సహనం, ఓర్పుతో జగన్ ఎంతో ఎత్తుకు ఎదిగారు- విజయమ్మ

  • 12:20 PM

    వైఎస్ఆర్ అందరివాడు- విజయమ్మ

    కోట్ల మంది గుండెల్లో సజీవంగా ఉన్నారు- విజయమ్మ

    ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్ సీపీ పుట్టింది- విజయమ్మ

  • 12:07 PM

    2009, సెప్టెంబర్ 5న సంఘర్షణ మొదలైంది

    నాన్న ఇచ్చిన కుటుంబం ఏనాడు నా చేయి వదల్లేదు

    మన జెండాను గుండెగా మార్చుకున్న కోట్లాది మందికి సెల్యూట్

    టీడీపీని 23 సీట్లకు దేవుడు పరిమితం చేశాడు

    మార్పు అంటే ఏమిటో వైఎస్సార్ ప్రభుత్వం చూపించింది

  • 11:53 AM

    ప్లీనరీ వేదికపై వైఎస్సార్‌ విగ్రహానికి నివాళి అర్పించిన సీఎం జగన్‌

    ప్లీనరీ సమావేశాలకు హాజరైన వైఎస్‌ విజయమ్మ

     

  • 11:50 AM

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ప్రారంభం
    పార్టీ జెండాను ఆవిష్కరించి పీన్లరీని ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

  • 10:19 AM

    ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ లో వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల నివాళి

    ఇడుపులపాయ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న  వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌

Trending News