SPB last rites: బాలుకు నివాళులర్పించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (sp balasubrahmanyam) భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు ప్రారంభమయ్యాయి. చెన్నైలోని తామరైపాక్కంలో ఉన్న బాలు వ్యవసాయ క్షేత్రంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది.

Last Updated : Sep 26, 2020, 12:28 PM IST
SPB last rites: బాలుకు నివాళులర్పించిన ఏపీ మంత్రి అనిల్ కుమార్

AP Minister Anil Kumar attended sp balu funeral: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (sp balasubrahmanyam) భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు ప్రారంభమయ్యాయి. చెన్నైలోని తామరైపాక్కంలో ఉన్న బాలు వ్యవసాయ క్షేత్రంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. అయితే.. బాలసుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాల ( SPB last rites ) సందర్భంగా ఆయన్ను కడసారి చూసేందుకు భారీ ఎత్తున ఆయన అభిమానులు, ప్రముఖులు వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. అయితే ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Govt) తరపున మంత్రి అనిల్‌ కుమార్‌ (Anil Kumar Poluboina) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎస్పీ బాలు భౌతిక కాయానికి నివాళులర్పించారు.  అనంతరం బాలు కుమారుడు ఎస్పీ చరణ్‌ను ఓదార్చారు. ఆయనతోపాటు వైఎస్సార్‌ సీపీ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ ‌రెడ్డి కూడా ఎస్పీ బాలుకు పార్థివ దేహానికి నివాళులర్పించి, ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. Also read: Tollywood: సెప్టెంబరు 25 టాలీవుడ్‌కు బ్లాక్ డే.. ఇప్పుడు బాలు, అప్పుడు వేణు

sp-balu

మరికొద్దిసేపట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు జరగనున్నాయి. బాలు కుటుంబసభ్యులు తమ ఆచార వ్యవహారాల ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాల ( SPB last rites ) సందర్భంగా బాలుని కడసారి చూసుకుంటూ కుటుంబసభ్యులు, అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే కొవిడ్-19 నిబంధనల కారణంగా అందరినీ లోపలికి అనుమతించకుండా పరిమిత సంఖ్యలో సన్నిహితులు, ప్రముఖులు, అభిమానులను పోలీసులు లోపలికి అనుమతించారు. 

sp balu

Trending News