Tata AirIndia: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియాను.. భారత ప్రభుత్వం నేడు (జనవరి 27) అధికారికంగా టాటా గ్రూప్‌కు (Air India handed over to Tata Group) అప్పగించింది. దీనితో దాదాపు 69 ఏళ్ల తర్వాత ఎయిర్ఇండియా తిరిగి సొంత గూటికి చేరింది.
ఎయిర్ఇండియాను టాటా గ్రూప్‌కు అప్పగించినప్పటికీ.. తక్షణమే టాటా గ్రూప్ కింద ఎయిర్ఇండియా విమానాలు నడవవని అధికారులు వెల్లడించారు.
ఎయిర్ఇండియాను అధికారికంగా టాటా గ్రూప్‌కు అప్పగించే ప్రక్రియలో భాగంగా.. టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ ఒప్పందంపై చర్చించారు.
Shri N Chandrasekaran, the Chairman of Tata Sons called on PM @narendramodi. @TataCompanies pic.twitter.com/7yP8is5ehw
— PMO India (@PMOIndia) January 27, 2022
ఎయిర్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) కార్యదర్శి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో కూడా భేటీ అయ్యారు చంద్రశేఖరన్. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ ద్వారా ఎయిర్ ఇండియా షేర్ (Air India latest news) చేసింది.
టాటా సన్స్‌కు చెందిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థ Talace (ట్యాలెస్) ద్వారా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఇండియా ఎస్ఏటీఎస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ స్వాధీన ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర (Tata group Air India deal) వేసింది.
ఇక ఎయిర్ ఇండియా తిరిగి సొంత గూటికి చేరుతుండటంపై టాటా గ్రూప్ కూడా హర్షం వ్యక్తం చేసింది. 'నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం' అంటూ (Tata group on Air India) ట్వీట్ చేసింది.
Your arrival was much awaited, @airindiain. #AirIndiaOnBoard #ThisIsTata pic.twitter.com/OVJiI1eohU
— Tata Group (@TataCompanies) January 27, 2022
ఒప్పందం ఇలా..
ఎయిర్ ఇండియాను విక్రయించేందుకు గత ఏడాది బిడ్లను ఆహ్వానించగా.. టాటా గ్రూప్ దాని అనుబంధ సంస్థ ట్యాలెస్ ద్వారా బిడ్ దాఖలు చేసింది. 2021 అక్టోబర్ 8న బిడ్లకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. రూ.18,000 కోట్లకు ఎయిర్ఇండియాలో 100 శాతం వాటాను కొనుగోలు (Tata Gorup Air India deal value) చేసింది టాటా గ్రూప్. ఈ మరేకు గత ఏడాది అక్టోబర్ 25నే కేంద్రం షేర్ పర్చేస్ ఒప్పదంపై సంతకాలు చేసింది.
ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను కూడా టాటా గ్రూప్‌కు అప్పగించింది. దీనితో పాటు గ్రౌండ్ కార్యకలపాలు నిర్వహించే ఎయిర్ఇండియా ఎస్ఏటీఎస్లో 50 శాతం వాటా టాటా గ్రూప్‌కు (Air India privatisation news) దక్కింది.
#FlyAI : Air India Limited, Air India Express & AISATS (AI stake) have become part of the Tata Group today.
Senior Officials of @TataCompanies , @SecyDIPAM and @MoCA_GoI met at Airlines House New Delhi. pic.twitter.com/HA4aEkVwWX
— Air India (@airindiain) January 27, 2022
ఎయిర్ ఇండియా చరిత్ర..
1932లో తొలిసారిగా టాటా గ్రూప్ ఇండియాలో ఎయిర్‌లైన్స్‌ను స్థాపించింది. అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ జేఆర్డీ టాటా ఆధ్వర్యంలో ఇది విజయవంతంగా నడిచింది. అయితే 1953లో జాతీయీకరణలో ఎయిర్ ఇండియా (Air India history) పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది.
చాలాకాలం విజయవంతంగా నడిచిన ఎయిర్ఇండియా.. దాదాపు పదేళ్ల క్రితం నష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ప్రభుత్వ నిధులు లేనిదే కనీసం సంస్థ కార్యకలాపాలు సాగించలేని స్థితికి (Air India debts) చేరుకుంది.
దీనితో 2018 నుంచి ఎయిర్ ఇండియాను విక్రయించాలని ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు (Air India for sale) పెట్టింది. అయితే తొలి ప్రయత్నంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో.. సంస్థలో వంద శాతం వాటా విక్రయించాలని 2020లో నిర్ణయించింది. కొవిడ్ కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైంది.
ఎట్టకేలకు గత ఏడాది అక్టోబర్‌లో ఇందుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఇప్పుడు దాదాపు 7 దశాబ్ధాల తర్వాత మహారాజ (ఎయిర్ ఇండియా) తిరిగి సొంత గూటికి (Air India to part in Tata group) చేరుతోంది.
Also read: Stock Market today: స్టాక మార్కెట్లకు మళ్లీ నష్టాలు- ఐటీ షేర్లు కుదేలు..!
Also read: Jio Recharge Plan: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. రూ.150లకే అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook