Free Gas Cylinder: దీపావళి నుంచి ​ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు.. వెంటనే ఇలా దరఖాస్తు చేసుకోండి

Free Gas Cylinder: దీపావళికి ముందే ఫ్రీ సిలిండర్ స్కీం షురూ అయ్యింది. దీపావళి రోజు పలు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈమధ్యే యూపీ సర్కార్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీంను ప్రకటించింది. మీరు కూడా ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీంను పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.   

Written by - Bhoomi | Last Updated : Oct 28, 2024, 04:00 PM IST
Free Gas Cylinder: దీపావళి నుంచి ​ఉచితంగా  గ్యాస్‌ సిలిండర్లు.. వెంటనే ఇలా దరఖాస్తు చేసుకోండి

Free Gas Cylinder:  ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి దీపావళికి బహుమతిగా  ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇప్పటికే  కేంద్ర ప్రభుత్వం హామీచ్చింది. ఈ మధ్యే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీంను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏపీ కూడా దీపావళికి ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను అందించేందుకు ప్లాన్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ సర్కార్ గతంలో హోలీ, దీపావళి సందర్భంగా లబ్దిదారులకు ఫ్రీ సిలిండర్లను ప్రకటించింది. ఈ దీపావళికి రాష్ట్రంలోని 1,84,039 మంది లబ్దిదారులకు ఉచిత సిలిండర్ల ప్రయోజనం పొందనున్నారు. 

ఈ ప్రయోజనం ఎలా పొందాలంటే? 

ఈ ప్రయోజనాన్ని పొందేందుకు కనెక్షన్ హోల్డర్లు గ్యాస్ సిలిండర్ కోసం ముందుగానే నగదు చెల్లించాల్సి ఉంటుంది. మూడు నుంచి నాలుగు రోజుల్లో వినియోగదారుని బ్యాంకు అకౌంటుకు మొత్తం డబ్బు తిరిగి చెల్లిస్తారు. 

ఎవరు అర్హులు? 

వెరిఫైడ్ ఆధార్ తో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద రిజిస్టర్ చేసుకున్న ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన వినియోగదారులకు మాత్రం ఈ స్కీం నుంచి ప్రయోజనం పొందుతారు. మీరు ఇంకా మీ ఇ కేవైసీని పూర్తి చేయనట్లయితే ఈ ప్రయోజనం కోసం అర్హత పొందేందుకు ఆధార్ కార్డు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ గ్యాస్ ఏజెన్సీని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. 

ఎలా దరఖాస్తు చేసుకోవాలి ? 

యూపీ ప్రభుత్వం నుంచి ప్రకటన అనంతరం ఏపీ, ఉత్తరాఖండ్ కూడా ఈ దీపావళికి ఉజ్వల యోజన కింద లబ్దిదారులకు ఫ్రీ సిలిండర్లను అందించనున్నాయి. ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ఉజ్వల యోజన కింద  రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ సమీప కామన్ సర్వీస్ సెంటర్ లేదా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ప్రధానంగా మహిళ కోసం రూపొందించింది. రిజిస్టర్ చేసుకునేందుకు నిర్దిష్ట అర్హత ప్రమాణాలకే అనుగుణంగా ఉండాలి. ఉజ్వలయోజన కింద లబ్దిదారులు ఇప్పటికే సాధారణ వినియోగదారుల కంటే తక్కువ ధరకు సిలిండర్లను పొందుతున్నారు. ఒక్కో సిలిండర్ కు దాదాపు రూ. 300 సిబ్సిడీతో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News