Diwali 2024: దీపావళి నాడు ముహూరత్ ట్రేడింగ్ లో కొత్త షేర్లను కొనుగోలు చేస్తుంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని ఇన్వెస్టర్లు నమ్ముతుంటారు. గత ఏడాది దీపావళి నుండి ఇప్పటి వరకు మార్కెట్ దాదాపు 30 శాతం పెరిగింది. సెన్సెక్స్ 62,000 నుంచి 80,000 పాయింట్లను దాటింది.అదే సమయంలో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గత ఏడాదిలో 50 శాతం కంటే ఎక్కువ రాబడినిచ్చాయి.
ప్రస్తుతం దేశంలో 18 కోట్ల మందికి డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. అయితే నాలుగేళ్ల క్రితం డీమ్యాట్ ఖాతాలు కలిగి ఉన్న వారి సంఖ్య కేవలం 3.6 కోట్లు మాత్రమే ఉంది. ఇన్వెస్టర్లలో 22 శాతం మంది మహిళలు, 69 శాతం మంది ఇన్వెస్టర్లు 40 ఏళ్ల లోపు వారే కావడం మార్కెట్ రాబడుల ఆకర్షణగా నిలుస్తున్నారు.
కొత్తగా మార్కెట్లో ప్రవేశించే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఒక మార్గం:
దీపావళి సందర్భంగా మీరు మార్కెట్లో ప్రవేశించాలి అనుకున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ ఒక చక్కటి మార్గం అని చెప్పవచ్చు. నేరుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టలేని వారు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అనేది ప్రముఖ అసెట్ మేనేజ్ మెంట్ సంస్థలు ఒక ఫండ్ మేనేజర్ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి మార్కెట్ రీసెర్చ్ ద్వారా ఎంపిక చేసిన స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆయా స్టాక్స్ లో వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లకు పంచుతారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించడం సులువైన పద్ధతి, ఇందుకోసం మీరు చక్కటి మ్యూచువల్ ఫండ్ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఫండ్ మేనేజర్ల చేతిలో ఉంటుంది.
Also Read: Bank Holidays: నవంబర్ నెలలో కేవలం 12 రోజులే బ్యాంకులు పనిచేస్తాయి.. కారణం తెలుసా?
మ్యూచువల్ ఫండ్స్ లో ఫెట్టుబడి ఎలా పెట్టాలి:
మ్యూచువల్ ఫండ్స్ లో రెండు పద్ధతుల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఒకటి మీరు ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా దానిపై వచ్చే రాబడిని పొందవచ్చు. ఇక రెండోది సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఇందులో మీరు ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, నిర్ణీత కాలానికి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఇలా మీరు ఎంపిక చేసుకున్న కాలాన్ని బట్టి ఈ ఫండ్స్ ఉంటాయి.
నేరుగా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించాలంటే..?
ఇక నేరుగా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించాలి అంటే మార్కెట్ అధ్యయనం చేయడం తప్పనిసరి. మార్కెట్లో 4 రకాల స్టాక్స్ ఉంటాయి. వీటిలో మొదటిది లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే వీటి పెట్టుబడి మార్కెట్లో పెద్ద మొత్తంలో ఉంటుంది. మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్, పెన్నీ స్టాక్స్ రూపంలో ఉంటాయి. వీటిలో మిడి కాప్ స్టాక్స్ అంటే వీటి పెట్టు మార్కెట్ క్యాప్ మధ్యస్థంగా ఉంటుంది. స్మాల్ క్యాప్ స్టాప్స్ అంటే వీటి పెట్టుబడి మార్కెట్లో తక్కువగా ఉంటుంది. ఇక పెన్నీ స్టాక్స్ అంటే వీటి పేరుకు తగ్గట్టుగానే చాలా తక్కువ విలువ కలిగిన స్టాక్స్ గా ఉంటాయి.
Also Read: Gold Price : పసిడిని పట్టుకోవడం కష్టమే..భారీగా పెరిగిన బంగారం ధర..వెండి ధర ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter