Flipkart Offers: రూ.7 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ.749కే!

Flipkart Sale: అతి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్‌లో బెస్ట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవాళే రియల్ మీ సీ30 స్మార్ట్ ఫోన్ అమ్మకానికి వస్తుంది. ఫీచర్స్, ధర పూర్తి వివరాలు మీ కోసం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 27, 2022, 01:38 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్ సేల్
  • నేటి నుంచే అమ్మకానికి రియల్ మీ సీ30 స్మార్ట్ ఫోన్
Flipkart Offers: రూ.7 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ కేవలం రూ.749కే!

Realme C30 First Sale:  ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌‌ ఎలక్ట్రానిక్ సేల్ లో రియల్ మీ సీ30 స్మార్ట్ ఫోన్ (Realme C30 Smart Phone) ఈ రోజు మధ్యాహ్నాం 12 గంటలకు అమ్మకానికి రానుంది. ఇది రెండు వేరియంట్లలో లభించనుంది. 2 GB RAM, 32 GB స్టోరేజ్ తో ఒక మోడల్, 3 GB RAM, 32 GB స్టోరేజ్ తో మరో మోడల్ ను లాంఛ్ చేయనున్నారు. దీనిపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ ను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటే చౌక ధరకే మీ ఫేవరెట్ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.  యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉంటే 5 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. 2 జీబీ ఫోన్ ఫ్రారంభ ధర రూ. 7,499గా, 3 జీబీ ఫోన్ ఎంట్రీ లెవల్ ధర రూ. 8299గా నిర్ణయించారు. 

కేవలం రూ.749:
realme C30 (లేక్ బ్లూ, 32 జీబీ) స్మార్ట్ ఫోన్‌ సాధారణ ధర రూ.7,499. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు యాక్సిస్ బ్యాంక్ కార్డు వాడినట్లయితే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది. అంటే మరో రూ.375 వరకు తగ్గింపును పొందవచ్చు. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే  రూ. 6750 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ ను పూర్తిగా వాడుకున్నట్లయితే ఈ ఫోన్‌ని డెడ్ చీప్‌గా రూ.749కే పొందవచ్చు. 

Realme C30  ఫీచర్స్ :
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
16.51 సెం.మీ హెచ్‌డీ డిస్‌ప్లే
8 ఎంపీ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
5000 mAh బ్యాటరీ సామర్థ్యం
Unisoc T612 ప్రాసెసర్ 

Also Read: Cheapest Data Plan: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్‌.. అతి తక్కువ ధరలో ఏడాది పాటు అపరిమిత కాలింగ్, డేటా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News