SIP Tricks: మ్యూచ్యువల్ ఫండ్స్‌లో 10 కోట్లు సంపాదించి పెట్టే 3 ఎస్ఐపీ ట్రిక్స్ ఇవే

SIP Tricks in Telugu: షేర్ మార్కెట్లో కొత్తగా ప్రవేశించేవారికి బెస్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు సులభమైన మార్గం సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. అంటే ఎస్ఐపీ. మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి రిటర్న్స్ పొందాలంటే ఎస్ఐపీలో మూడు మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 17, 2025, 06:29 PM IST
SIP Tricks: మ్యూచ్యువల్ ఫండ్స్‌లో 10 కోట్లు సంపాదించి పెట్టే 3 ఎస్ఐపీ ట్రిక్స్ ఇవే

SIP Tricks in Telugu: సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన మార్గం. ఎందుకంటే ఒకేసారి భారీగా ఇన్వెస్ట్ చేయలేనప్పుడు ప్రతి వారం లేదా ప్రతి నెలా కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎస్ఐపీ అనేది తక్కువ రిస్క్‌తో అధిక లాభాలిచ్చే మార్గం. అందుకే దేశంలో ఎస్ఐపీ అనేది ప్రాచుర్యం పొందుతోంది. 

మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లాభాలు పొందాలంటే ఎస్ఐపీ బెస్ట్ ఆప్షన్. ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేస్తుంటే మార్కెట్ పరిస్థితితో సంబంధం లేకుండా మంచి రిటర్న్స్ పొందవచ్చు. అయితే ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని ట్రిక్స్ పాటిస్తే మంచి లాభాలు పొందవచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎస్ఐపీ ట్రిక్స్ పూర్తిగా అర్ధం చేసుకుటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లక్షలు సంపాదించడం పెద్ద కష్టమేం కాదంటున్నారు. 30 ఏళ్లలో 10 కోట్లకు పైగా సంపాదించవచ్చు. ఇలాంటి ట్రిక్స్ ఎస్ఐపీలో మూడు ఉన్నాయి. 

1. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి కొన్ని ఫార్ములాలు ఉన్నాయి. ఇందులో మొదటిది 15-15-15. అంటే ప్రతి నెలా 15 వేల రూపాయలు 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్స్ 15 శాతం లెక్కేస్తే 1.02 కోట్లు సమకూర్చవచ్చు.

2. రెండవ ఎస్ఐపీ ఫార్ములా 15-15-30. ఈ ఫార్ములా ప్రకారం ఓ వ్యక్తి ప్రతి నెలా 15 వేల రూపాయలు 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 15 శాతం రిటర్న్స్ లెక్కేస్తే 10.51 కోట్లు సంపాదించవచ్చు. అంటే 30 ఏళ్లలో మీరు ఇన్వెస్ట్ చేసేది 54 లక్షలు ఉంటే అది 9.97 కోట్లకు పెరుగుతుంది. ఎస్ఐపీలో దీర్ఘకాలం ఉంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. తమ తమ ఆదాయాలకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు.

3. ఒకవేళ ఎవరైనా 30 ఏళ్ల వయస్సులో ఇన్వెస్ట్ మొదలు పెడితే రిటర్న్స్ అధికంగా ఉంటాయి. ఇలా ఎవరైనా ఓ వ్యక్తి నెలకు 5 వేల చొప్పున 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే 12 శాతం కనీసం రిటర్న్స్ లెక్కేసుకుంటే 84,31,033 అవుతుంది. అదే 25 ఏళ్ల వయస్సులో ప్రారంభించి 30 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే  15 శాతం రిటర్న్స్ లెక్క ప్రకారం 1,52,60,066 రూపాయలు అవుతుంది. 

టాప్ 10 ఇయర్ మ్యూచువల్ ఫండ్స్

ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్                       20.04 శాతం
నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్        18.14 శాతం
ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్       16.54 శాతం
కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్                  15.95 శాతం
డీఎస్పీ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్                          15.27 శాతం

Also read: Champions Trophy 2025 Timetable: ఛాంపియన్ ట్రోఫీకు అంతా సిద్ధం, ఏ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ ఫుల్ టైమ్ టేబుల్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News