Man Buried Alive To Earn Money: డబ్బు సంపాదన కోసం ఏమైనా చేయడానికి వెనుకాడటం లేదు కొంతమంది దురాశపరులు. నవరాత్రి సందర్భంగా భక్తుల సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకుని భారీ మొత్తంలో విరాళాలు సేకరించేందుకు ప్లాన్ చేసిన ఓ వ్యక్తి తన సమీప బంధువైన ఓ యువకుడిని సజీవ సమాధి చేశాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా బంగార్మావ్ తాలుకాలోని తాజ్‌పూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నవరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షించి, వారి నుండి భారీ మొత్తంలో విరాళాలు సేకరించేందుకు మున్నా లాల్ పాండే ప్లాన్ చేశాడు. ఇందుకోసం మరో ముగ్గురు సహాయకులను ఏర్పాటు చేసుకున్నాడు. వారి సహాయంతో తన సమీప బంధువునే ఓ గుంతలో సజీవంగా సమాధి చేశాడు. ఆ దృశ్యం చూపించి అక్కడికి వచ్చే భక్తుల సెంటిమెంటును క్యాష్ చేసుకోవాలని ఎత్తుగడ వేశాడు.
దొంగ బాబా నేతృత్వంలో సజీవ సమాధి విషయం పోలీసులకు తెలిసిపోవడంతో వారు రంగంలోకి దిగారు. ఆదివారం రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ గుంతను తవ్వి అందులోంచి యువకుడిని బయటికి తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారం దగ్గరుండి నడిపించిన మున్నా లాల్ పాండేతో పాటు అతడికి సహాయపడిన ముగ్గురు ప్రభాశంకర్ శుక్లా, సతీష్ చంద్ర, శివ్ కేశ్ దీక్షిత్ లను అదుపులోకి తీసుకుని కేసు నమేదు చేశారు.
పోలీసులు కాపాడిన తర్వాతే తనపై జరిగిన అసలు కుట్ర ఏంటో అర్థం చేసుకున్న బాధిత యువకుడు గోస్వామి.. అసలు విషయాన్ని పోలీసులకు పూసగుచ్చినట్టు చెప్పాడు. రుషుల తరహాలో కొన్ని రోజులుపాటు సజీవ సమాధి అయితే.. ఆ తర్వాత ఆ స్థలం పెద్ద పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుందని.. తద్వారా భారీ మొత్తంలో విరాళాల రూపంలో బాగా డబ్బు సంపాదించొచ్చని చెప్పాడని మున్నా లాల్ పాండే గురించి మొత్తం పోలీసులకు వివరించాడు. అంతేకాకుండా ఈ సజీవ సమాధి పేరుతో తనకు తెలియకుండానే తనను చంపేందుకు కుట్ర జరిగిందని గోస్వామి పోలీసులకు (UP Police) ఫిర్యాదు చేశాడు. గోస్వామి చెప్పిందంతా విని పోలీసులతో పాటు జనం కూడా ముక్కున వేలేసుకున్నారు.
Also Read : Kidneys Theft: ఆస్పత్రికి వెళ్లిన మహిళ రెండు కిడ్నీలు మాయం.. అవయవాల దొంగల ముఠా పనేనా ?
Also Read : Assault On Student: వాడు నా ప్రైవేట్ పార్ట్స్ ఒత్తుతూ లైంగికంగా వేధించాడు.. కాలేజ్ స్టూడెంట్ ఫిర్యాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి